IPL 2020 : ఇదో అద్భుతమైన మ్యాచ్.. ప్ర‌పంచంలోనే ఐపీఎల్ బెస్ట్ లీగ్…

ప్రపంచలోని అన్ని లీగ్స్‌లోనే ఐపీఎల్ అద్భుతం. ఇలా అన్నది ఎవరో కాదు బీసీసీఐ అధ్యక్షుడు.. బెంగాల్ టైగర్ సౌర‌వ్ గంగూలీ. షార్జా వేదికగా జరగిన కింగ్స్ లెవ‌న్ పంజాబ్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన హైస్కోర్ మ్యాచ్ అంద‌ర్నీ ఆకట్టుకుంది.

IPL 2020 : ఇదో అద్భుతమైన మ్యాచ్.. ప్ర‌పంచంలోనే ఐపీఎల్ బెస్ట్ లీగ్...
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 28, 2020 | 12:43 PM

Sourav Ganguly : ప్రపంచలోని అన్ని లీగ్స్‌లోనే ఐపీఎల్ అద్భుతం. ఇలా అన్నది ఎవరో కాదు బీసీసీఐ అధ్యక్షుడు.. బెంగాల్ టైగర్ సౌర‌వ్ గంగూలీ. షార్జా వేదికగా జరగిన కింగ్స్ లెవ‌న్ పంజాబ్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన హైస్కోర్ మ్యాచ్ అంద‌ర్నీ ఆకట్టుకుంది.

ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఆ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ అనూహ్య విజ‌యాన్ని అందుకుంది. 224 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్.. షార్జా స్టేడియంలో హోరెత్తించింది. మ‌రో 3 బంతులు మిగిలి ఉండ‌గానే టార్గెట్‌ను చేరుకున్న‌ది. బౌండ‌రీల వ‌ర్షం కురిసిన ఆ మ్యాచ్‌పై సౌర‌వ్ గంగూలీ స్పందించారు.

ఇదో ఓ అద్భుతమైన మ్యాచ్ అని, అందుకే ప్ర‌పంచంలో ఐపీఎల్ బెస్ట్ లీగ్ అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ వేదికగా స్పందించారు. ఆట‌గాళ్లు అత్యుద్భుత ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారని ప్రశంసల జల్లు కరిపించారు. పంజాబ్‌, రాజ‌స్థాన్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ మొత్తం 34 ఫోర్లు, 29 సిక్స‌ర్లతో మెరిపించారు. పంజాబ్ బ్యాట్స్‌మెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 107 ర‌న్స్ చేయ‌గా.. రాజ‌స్థాన్ జ‌ట్టులో స్మిత్‌, తెవాటియా, శాంస‌న్‌లు హాఫ్ సెంచ‌రీల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడారు.