ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక శాఖాహారులున్నారో తెలుసా..? భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..
శాఖాహార భోజనం ఆయురారోగ్యాలకు మూలమని మన పూర్వికుల నాటి నుంచి నానుడి. దీర్ఘాయువుకు కూడా శాఖాహారమే కారణం కావడం విశేషం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు తినేవారు వృద్ధాప్యంలో కూడా సంపూర్ణ ఆరోగ్యంగా..
శాఖాహార భోజనం ఆయురారోగ్యాలకు మూలమని మన పూర్వికుల నాటి నుంచి నానుడి. దీర్ఘాయువుకు కూడా శాఖాహారమే కారణం కావడం విశేషం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు తినేవారు వృద్ధాప్యంలో కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఐతే ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక శాఖాహారులు ఉన్నారనే విషయం గురించి వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ తాజాగా ఓ సర్వే నివేదికను ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో శాఖాహారులు అత్యధికంగా భారత దేశంలో ఉన్నట్లు వెల్లడించింది. దీంతో భారత్ శాఖాహారులు అత్యధికంగా ఉన్న దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ జనాభాలో శాఖాహారుల వాటా విషయానికి వస్తే భారతదేశం దాదాపు 31 నుంచి 42 శాతం వాటాతో అగ్రగామిగా ఉంది. 2022 – 2023లో నిర్వహించిన నాలుగు సర్వేల ప్రకారం భారతీయ జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది శాఖాహారాన్ని అనుసరిస్తున్నట్లు తేలింది. ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో శాఖాహారాలు కేవలం ఐదు శాతం మాత్రమే ఉన్నారు.
వెజిటేరియన్ పాపులేషన్‌లో ఏయే దేశాల్లో ఎంత శాతం మంది ఉన్నారంటే..
- భారత్ 31-42 శాతం
- ఇజ్రాయెల్ 13 శాతం
- తైవాన్ 12 శాతం
- ఇటలీ 10 శాతం
- జర్మనీ 9 శాతం
- యూకే 9 శాతం
- యూఎస్ఏ 5-8 శాతం
- బ్రెజిల్ 8 శాతం
- ఐర్లాండ్ 6 శాతం
- ఆస్ట్రేలియా 5 శాతం
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.