Business Idea: కేవలం రూ. లక్ష పెట్టుబడితో భారీ ఆదాయం.. వచ్చే సమ్మర్‌ నాటికి ప్లాన్‌ చేస్తే..

వ్యాపారం అనగానే చాలా మంది సహజంగా భయపెడేది వ్యాపారంలో నష్టం వస్తుందేమోనని. అయితే సరైన ప్రణాళిక, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టం అనేది ఉండదు. అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మరో రెండు నెలలు గడిస్తే ఎండకాలం వచ్చేస్తుంది. అన్ని కాలాల్లోకంటే...

Business Idea: కేవలం రూ. లక్ష పెట్టుబడితో భారీ ఆదాయం.. వచ్చే సమ్మర్‌ నాటికి ప్లాన్‌ చేస్తే..
Business Idea
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 24, 2023 | 2:09 PM

ప్రస్తుతం యువత ఉద్యోగానికంటే వ్యాపారానికే పెద్ద పీట వేస్తోంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. తాము సంపాదించడమే కాకుండా తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో సరికొత్త వ్యాపారాలను అన్వేషిస్తూ దూసుకుపోతున్నారు. ఇక వ్యాపారం అనగానే చాలా మంది సహజంగా భయపెడేది వ్యాపారంలో నష్టం వస్తుందేమోనని. అయితే సరైన ప్రణాళిక, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టం అనేది ఉండదు. అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మరో రెండు నెలలు గడిస్తే ఎండకాలం వచ్చేస్తుంది. అన్ని కాలాల్లోకంటే ఎండకాలమే ఎక్కువసేపు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మండే ఎండలో ప్రజలు జ్యూస్‌లు తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో ఐస్‌ క్యూబ్‌లకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి వచ్చే సమ్మర్‌ నాటికి ఐస్‌ క్యూబ్‌ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలను ఆర్జించవచ్చు. ఇంతకీ ఐస్‌ క్యూబ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఐస్‌ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రీజర్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ఒక పెద్ద గదితో పాటు, విద్యుత్‌, నిరంతరం నీరు ఉండాలి. రకరకాల ఆకారాల్లో ఐస్‌ క్యూబ్స్‌ను తయారు చేయడానికి మిషిన్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభంలో రూ. లక్ష రూపాయాలతో ప్రారంభించవచ్చు. ఫ్రిజ్‌ కొనుగోలు చేయడానికి రూ. 50,000, ఇతర వస్తువులకు మరో రూ. 50,000 వరకు ఖర్చవుతుంది.

ఇక ఫ్రిజ్‌లు ఏర్పాటు చేయడానికి కొంత స్థలం ఉండాలి. స్థానికంగా ఉండే జ్యూస్‌ స్టాల్స్‌, సోడా బండ్లతో పాటు ఫంక్షన్‌ హాల్స్‌ను సంప్రదించి మీ ఫ్యాక్టరీ గురించి ప్రమోషన్‌ చేసుకోవాలి. వార్తా పత్రికల్లో ప్రకటనలు వేయడం లేదా పాంప్లెట్లు పంచడం ద్వారా మీ వ్యాపార విస్తృతిని పెంచుకోవచ్చు. కేవలం సమ్మర్‌లో మాత్రమే కాకుండా మిగత కాలాల్లోనూ ఐస్‌ క్యూబ్స్‌ వ్యాపారం నడుస్తుంది.

ఇక లాభాల విషయానికొస్తే.. రూ. లక్ష ప్రారంభ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే తక్కువలో తక్కువ నెలకు రూ. 30,000 వరకు ఆదాయాన్ని పొందొచ్చు. అదే పెళ్లిళ్ల సీజన్‌లో అయితే రూ. 50,000 వరకు ఆదాయం పొందొచ్చు. ఇక తయారు చేసిన ఐస్‌ను నేరుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు, వినియోగదారులే నేరుగా వచ్చి కొనుగోలు చేస్తారు కాబట్టి ఈ వ్యాపారంలో పెద్దగా రిస్క్‌ ఉండదు. అంతేకాకుండా ఈ వ్యాపారానికి పెద్దగా పెట్టుబడి కూడా ఉండదు. ఒకసారి ఫ్రిజ్‌ను ఇతర వస్తువులను కొనుగోలు చేస్తే చాలు. ఆ తర్వాత కేవలం నీరు, విద్యుత్‌ సరఫరా ఉంటే చాలు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..