Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Computer Keyboard: కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఎందుకు ఉండవు..?.. అలా ఎందుకు తయారు చేశారు..?

Computer Keyboard: ఈ రోజుల్లో కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. దీని గురించి తెలియనివారుండరు. ప్రస్తుతం కాలంలో కంప్యూటర్‌ ముఖ్యమైపోయింది...

Computer Keyboard: కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఎందుకు ఉండవు..?.. అలా ఎందుకు తయారు చేశారు..?
Follow us
Subhash Goud

|

Updated on: Feb 05, 2021 | 1:17 PM

Computer Keyboard: ఈ రోజుల్లో కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. దీని గురించి తెలియనివారుండరు. ప్రస్తుతం కాలంలో కంప్యూటర్‌ ముఖ్యమైపోయింది. ఏ ఉద్యోగం చేయాలన్నా ముందుగా కంప్యూటర్‌ వచ్చి ఉండాలి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో కంప్యూటర్ లేనిదే పనులు జరగవు. అయితే కంప్యూటర్ వాడాలంటే కీ బోర్డు తప్పనిసరి. కానీ మనం ప్రతి రోజు కీబోర్డుపై ఎంతో వర్క్ చేస్తుంటాము. కానీ ఒక విషయం గమనించి ఉండము. పెద్దగా పట్టించుకోము కూడా. అందేంటంటే మనం సాధారణంగా వాడే కీబోర్డును క్వర్టీ కీబోర్డు అంటాము.

కీబోర్డులో ఏబీసీడీలు వరుస సంఖ్యలో ఉండకుండా ఏ ఓ చోటు ఉంటే బీ మరో చోట ఉంటుంది. ఇలా కీబోర్డులోని కీస్ అన్ని కూడా గందరగోళంగా ఉంటాయి. ఇలా ఎందుకున్నాయని మీకెప్పుడైన అనుమానం వచ్చిందా..? వచ్చిన పెద్దగా పట్టించుకొని ఉండకపోవచ్చు.

అయితే కీ బోర్డు పై వరుసలో ఉన్న మొదటి ఆరు అక్షరాలు Q, W, E, R, T, Y వాటిని కలిపేసి పలుకుతారు. ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్‌ షోల్స్‌ అనే వ్యక్తి రూపకల్పన చేశారు. అంతకు ముందు A, B, C, D లాగా వరుసగా ఉన్న కీబోర్డు పై ఆయన కొన్ని ఇబ్బందులు గమనించారట. ఇంగ్లిషు భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువసార్లు, కొన్నయితే అతి అరుదుగా వస్తుంటాయి. ఉదాహరణకు Q, Z W, X, వంటి అక్షరాల వాడకం తక్కువగా ఉంటుంది. అచ్చులయిన A,E,I,O,U లతో పాటు, P, B, L, M, N, K, L వంటివి ఎక్కువ సార్లు ఉపయోగిస్తుంటాము. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను, ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానాల్లోను ఉండేలా షోల్స్‌ తాను రూపొందించిన టైపు మిషన్‌ కీబోర్డును ‘Qwerty’ నమూనాలో చేశాడట.

మనం సాధారణంగా ఈ అక్షరాలనే వాడుతుంటాము. పైనున్న అక్షరాలు తక్కువ ఉపయోగపడుతుంటాయి. అదే ఒరవడి కంప్యూటర్‌ కీ బోర్డులకూ విస్తరించింది. కానీ ఆధునిక పరిశోధనల ప్రకారం మరింత సులువైన ‘కీ బోర్డు’ అమరికలున్నట్లు రుజువు చేశారు. ఇలా ఎక్కువగా ఉపయోగించే కీస్‌ను బట్టి చేతివేళ్లకు అందుబాటులో ఉండే విధంగా తయారు చేశారు. ఈ కారణాలచేతనే కీ బోర్డులో ఏబీసీడీలు వరుస సంఖ్యలో ఉండకుండా తయారు చేయడానికి గల కారణమని తెలుస్తోంది.

Also Read: Fake WhatsApp Version: తస్మాత్ జాగ్రత్త.. చక్కర్లు కొడుతున్న నకిలీ వాట్సప్‌.. ఇన్‌స్టాల్ చేసుకున్నారో అంతే సంగతులు..