ID Cards: పెళ్లి తర్వాత అమ్మాయిలు ఏ పత్రాలను మార్చుకోవాలి? ఎందుకు మార్చుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..
ID Cards: భారతదేశంలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన ధృవపత్రాల లిస్ట్ చాలానే ఉంది. వాటిలో ప్రధానంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి. ఆధార్ కార్డ్ వ్యక్తి చిరునామా,
ID Cards: భారతదేశంలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన ధృవపత్రాల లిస్ట్ చాలానే ఉంది. వాటిలో ప్రధానంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి. ఆధార్ కార్డ్ వ్యక్తి చిరునామా, ధృవీకరణకు అవసరం. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి పాన్ కార్డ్ అవసరం. ఓటు వేయడానికి ఓటర్ ఐడి కార్డ్ చాలా ముఖ్యమైనది. ఇవే కాకుండా అనేక పనులకు ఈ కార్డులు అత్యంత కీలకం. ఈ ధృవీకరణ పత్రాలు లేకుండా ఏ పని కూడా చేయలేని పరిస్థితి ఉంది. వీటిని ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.
అయితే, వివాహమైన తరువాత సాధారణంగా అమ్మాయి పేరు ముందు భర్త ఇంటిపేరును చేర్చడం జరుగుతుంది. చాలా మంది అమ్మాయిలు తమ మునుపటి ఇంటిపేరును ఉపయోగిస్తున్నప్పటికీ, కొంతమంది అమ్మాయిలు ఇంటిపేరును మార్చుకుంటారు. ఇంటిపేరు మార్చుకోవాలా వద్దా అనేది వారి వ్యక్తిగత విషయం కానీ, పెళ్లి తర్వాత అమ్మాయిలు మార్చుకోవాల్సిన కీలక ధృవీకరణ పత్రాలు చాలానే ఉన్నాయి.
ఈ పత్రాలను సకాలంలో మార్చుకోండి.. చాలామంది వ్యక్తులు అనేక పొదుపు పథకాలు, ఇతరాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ సందర్భంగా చేసే అప్లికేషన్ ప్రాసెస్‌లో నామినీ పేరును పేర్కొనాల్సి ఉంటుంది. చాలా మంది వ్యక్తులు తమ భార్య పేరును నామినీగా పేర్కొంటారు. అంటే.. ఒకవేళ భర్త ఏదైనా కారణం చేత మరణించినట్లయితే.. నామినీగా ఉన్న భార్యకు ఆ పెట్టుబడి మొత్తం అందుతుంది. అయితే, ఇందుకోసం ధృవీకరణ పత్రాలు సరిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అసంపూర్ణంగా ధృవీకరణ పత్రాలు ఉన్నట్లయితే.. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పెళ్లైన తరువాత మహిళలు ఏ ధృవీకరణ పత్రాలను ఛేంజ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆధార్ కార్డ్.. ఆధార్ కార్డ్ భారతదేశ పౌరులకు భారత ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు. ఇది చిరునామా రుజువుగా కూడా ఉపయోగించబడుతుంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడం సహా అనేక అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే వివాహం తర్వాత అమ్మాయి చిరునామా కూడా మారుతుంది. పేరుతో పాటు ఇంటిపేరు కూడా మారే ఛాన్స్ ఉంది. కావున పెళ్లైన తరువాత ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో అమ్మాయి పేరు, చిరునామాను మార్చడం ముఖ్యం. అలా చేయడం ద్వారా భవిష్యత్‌లో వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
2. పాన్ కార్డ్.. మీరు ఉద్యోగం చేస్తూ నెలవారీగా జీతం పొందుతున్నట్లయితే.. తప్పనిసరిగా ఆదాయపు పన్ను చెల్లించి, ఐటీ రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు వివాహ తరువాత ఇంటిపేరు మారినట్లయితే.. కొత్త పాన్‌తో పాటు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాలి. దీని కోసం మీ పాన్‌ను అప్‌డేట్ చేసుకోవడం అవసరం. పాన్ ఎంతో కీలకమైన కార్డ్ కాబట్టి.. వీలైనంత త్వరగా దానిని అప్‌డేట్ చేసుకోవాలి.
3. బ్యాంక్ సంబంధిత సమాచారం.. బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి లోన్ తీసుకునే వరకు ప్రతి ప్రక్రియకు అడ్రస్ ప్రూఫ్ కావాలి. పెళ్లి తర్వాత మీరు డాక్యుమెంట్లు మార్చుకున్నట్లయితే, ముందుగా బ్యాంకుకు వెళ్లి వాటిని అప్‌డేట్ చేసుకోవాలి. బ్యాంక్‌లో మీ చిరునామా, ఇతర విషయాలను మార్చే వరకు అన్ని డాక్యూమెంట్స్ మీ పాత చిరునామాకు మాత్రమే చేరుతుంది.
4. పాస్‌పోర్ట్.. పెళ్లయిన తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలనే ఒత్తిడి ఉండదు. అయితే, మీరు ఇంటిపేరును మార్చుకుంటున్నట్లయితే, ధృవీకరణ పత్రాలను కూడా అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే, పాస్‌పోర్ట్‌లో వివాహం తర్వాత పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఉన్న పేరుతో కూడా ప్రయాణించవచ్చు. అయితే, ఒకవేళ మీరు ఇంటి పేరు, పేరు మార్చుకోవాలనుకుంటే.. పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
5. ఓటరు గుర్తింపు కార్డు.. మీరు భారతదేశ పౌరులైతే తప్పనిసరిగా మీ ఓటును కూడా ఉపయోగించుకోవాలి. ఒకవేళ పెళ్లి తరువాత వేరే చోట సెటిల్ అయితే.. ఓటర్ ఐడీ కార్డును మార్చుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ మార్చుకోకుండా ఉంటే ఎన్నికల వేళ అదే స్థానంలో ఓటు వినియోగించుకోవచ్చు.
Also read:
Vangaveeti Radha: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ.. ఇంటెలిజెన్స్ డీజీకి సీఎం ఆదేశం..
Viral Video: ఎలుగుబంటి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా.. రోడ్ సేఫ్టీపై వైరల్ వీడియో..