Dream: కలలో పులి కనిపించిందా.? దీని అర్థం ఏంటో తెలుసా.?

సాధారణంగా కలలో పులి కనిపిస్తే భయపడుతాం. దీనికి కారణం పులి అనేది ఒక క్రూర జంతువు. పులి చూడగానే భయమేస్తుంది. కాబట్టి పులి కలలో కనిపిస్తే అదేదో చెడుకు సంకేతంగా భావిస్తుంటాం. అయితే కలలో పులి కనిపించడం చెడుకు సంకేతం కాదని, మంచికేనని నిపుణులు చెబుతున్నారు. కలలో పులి మనకు కనిపించిన విధానం బట్టి ఫలితాలు మారుతాయని అంటున్నారు...

Dream: కలలో పులి కనిపించిందా.? దీని అర్థం ఏంటో తెలుసా.?
Tiger In Dream
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 02, 2024 | 2:48 PM

మనలో ప్రతీ ఒక్కరికీ పడుకున్న సమయంలో కల రావడం సర్వసాధారణమైన విషయం. మన ప్రమేయం లేకుండానే రాత్రుళ్లు కలలు వస్తుంటాయి. అయితే మనకు వచ్చే ప్రతీ కల వెనకాల ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతుంటారు. స్వప్నశాస్త్రంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇక మానసిక నిపుణులు సైతం కలలో కనిపించే అంశాలు మన వాస్తవిక జీవితంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని అంటుంటారు. మరి కలలో పులి కనిపిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా కలలో పులి కనిపిస్తే భయపడుతాం. దీనికి కారణం పులి అనేది ఒక క్రూర జంతువు. పులి చూడగానే భయమేస్తుంది. కాబట్టి పులి కలలో కనిపిస్తే అదేదో చెడుకు సంకేతంగా భావిస్తుంటాం. అయితే కలలో పులి కనిపించడం చెడుకు సంకేతం కాదని, మంచికేనని నిపుణులు చెబుతున్నారు. కలలో పులి మనకు కనిపించిన విధానం బట్టి ఫలితాలు మారుతాయని అంటున్నారు.

ఒకవేళ కలలో పులి ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఉన్నట్లు కనిపిస్తే చాలా మంచిదని అంటున్నారు. రానున్న రోజుల్లో మీకు అదృస్టం వరించనుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ పులి మీ ఇంట్లోకి వచ్చినట్లు కలలో వస్తే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే రానున్న రోజుల్లో మీరు చేపట్టబోయే పనులన్నీ విజయవంతమవుతాయని అర్థం. ఒకవేళ కలలో తెల్ల పులి కనిపిస్తే మరీ మంచిదని అంటున్నారు. మంచి ఫలితాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం చేసుకోవాలి. ఉద్యోగంలో ప్రమోషన్స్‌ వస్తాయని అర్థం. అలాగే అప్పటి వరకు ఆగిపోయిన పనులు పూర్తవుతాయని అర్థం చేసుకోవాలి.

ఇక సాధారణంగా పులి మనల్ని తరుముతున్నట్లు కల వస్తే భయపడుతాం. కానీ ఇది కూడా మంచికేనని అర్థం. వచ్చే రోజుల్లో ధన లాభం కలగబోతుందని అర్థం చేసుకోవాలి. ఊహించని విధంగా చేతికి ధనం లభిస్తుంది. ఒకవేళ పులిని చంపినట్లు కనిపిస్తే.. మీ శత్రువులపై విజయాన్ని సాధించబోతున్నారని అర్థం. ఇక పులి ఏదైనా జంతువును తింటున్నట్లు కనిపిస్తే.. మీ జీవితంలో మంచి పురోగతిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..