అరే ఏంట్రా ఇది.. కరెంట్ స్తంబాలు పెట్టడానికి వేరే చోటే దొరకలేదా.? నోరెళ్లబెట్టిన నెటిజన్లు..
ఎందుకని నడిరోడ్డు మధ్యలో విద్యుత్ స్తంబాలు పెట్టకూడదనుకున్నారో.? ఏంటో.? ఆ ఆలోచన వచ్చేందే తడువుగా అమలు చేసేశారు.

సాధారణంగా కరెంట్ స్తంబాలను ఇళ్ల సమీపంలో, రోడ్డు ప్రక్కన లేదా డివైడర్ల మధ్య పెడుతుంటారు. అయితే ఇక్కడ కొందరు అధికారులు ఎందుకని నడిరోడ్డు మధ్యలో విద్యుత్ స్తంబాలు పెట్టకూడదనుకున్నారో.? ఏంటో.? ఆ ఆలోచన వచ్చేందే తడువుగా అమలు చేసేశారు. ఈ ఘటన మరెక్కడో కాదు.. మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకారం.. పాకిస్థాన్‌లోని ఓ జాతీయ రహదారిపై ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా బోలెడన్ని విద్యుత్ స్తంబాలు నడిరోడ్డు మధ్యలో ఉన్నాయి. అన్ని స్తంబాలు సరిగ్గా మధ్యలోనే ఏర్పాటు చేసి ఉండటంతో.. ఇది ఏదో పొరపాటుగా చేసినట్లుగా కనిపించట్లేదు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అలా స్తంబాలు రోడ్డు మధ్యలో ఉన్నట్లయితే.. ప్రయాణీకులకు చాలా ప్రమాదకరమని అని ఫైర్ అవుతున్నారు.
ఇక పొగమంచు కురిసే రోజుల్లో.. చాలానే యాక్సిడెంట్స్ అవుతాయని తిట్టిపోస్తున్నారు. ఆ రోడ్డుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షామా జునేజో అనే నెటిజన్ పోస్ట్ చేయగా.. ఆమె’ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ మాజీ సీఎం ఉస్మాన్ బుజ్దర్ హయాంలోనా.? లేదా ప్రస్తుత సీఎం చౌదరీ పర్వేజ్ హయాంలో ఇలా జరిగిందా’ అని ప్రశ్నిస్తూ… ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
یہ کھمبے عثمان بوزدار کے دور میں لگے یا چوہدری پرویز اِلٰہی کے؟ pic.twitter.com/zxR52A3CW0
— Shama Junejo (@ShamaJunejo) October 4, 2022
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..
