AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Eclipse: దీపావళి రోజున సూర్యగ్రహణం.. గ్రహణ సమయం.. ఆ రోజున చేయవలసినవి.. చేయకూడనివి ఏమిటంటే..

సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉంటారు. సూర్యుడి నీడ భూమి మీద పడకుండా చంద్రుడు పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు.  

Solar Eclipse: దీపావళి రోజున సూర్యగ్రహణం.. గ్రహణ సమయం.. ఆ రోజున చేయవలసినవి.. చేయకూడనివి ఏమిటంటే..
Solar Eclipse
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 12, 2022 | 5:56 PM

Share

దీపావళి పర్వదినం అక్టోబర్ 25వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే.. పాక్షికంగా ఏర్పడనున్న ఈ గ్రహణం ఐరోపా, యురేపియన్ కంట్రీస్, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా,  పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాలతో పాటు మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.

భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. భూమి మీద కొంత భాగంలో సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనిపించడు. దీనిని సూర్యగ్రహణం అంటారు. భూమిని చంద్రుడి పూర్ణ ఛాయ (అంబ్రా) కప్పినపుడు మాత్రమే సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే సంపూర్ణ సూర్య గ్రహణం అరుదుగా ఏర్పడతాయి. అమావాస్య రోజున మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

భారతదేశంలో సూర్య గ్రహణ సమయం: 

ఇవి కూడా చదవండి

timeanddate.com వెబ్‌సైట్ ప్రకారం.. ఈ పాక్షిక సూర్యగ్రహణం న్యూఢిల్లీలో కనిపించనుంది. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది.

పాక్షిక గ్రహణం అంటే ఏమిటి?

సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉంటారు. సూర్యుడి నీడ భూమి మీద పడకుండా చంద్రుడు పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు.

సూర్యగ్రహణం చేయవలసినవి..  చేయకూడనివి:

భారతదేశంలో ప్రజలు సాధారణంగా గ్రహణం సమయంలో ఇంటి లోపల ఉండటానికి ఇష్టపడతారు. గ్రహణ కాలంలో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోరు. అలాగే గ్రహణం ఏర్పడే సమయంలో చెడు ప్రభావాలను నివారించడానికి దర్భ గడ్డి లేదా తులసి ఆకులను తినుబండారాల్లో, నీటిలో వేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు  ధరించాలని చాలా మంది నమ్ముతారు.

దేశంలో అనేకమంది గ్రహణ సమయంలో సూర్య భగవానుడికి చెందిన మంత్రాలను పఠిస్తారు.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండి సంతాన గోపాల మంత్రాన్ని జపిస్తారు.

చాలా మంది గ్రహణ సమయంలో నీరుని కూడా తాగరు.

అలాగే, గ్రహణ సమయంలో ఆహారాన్ని తయారు చేసుకోరు.. అంతేకాదు ఎటువంటి ఆహారపదార్ధాలను తినరు. శుభ కార్యాలను, పూజాధికార్యక్రమాలను నిర్వహించరు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

గ్రహణం పట్టిన సూర్యుడిని నేరుగా చూసే ప్రయత్నం చేయవద్దు. అలా చేయడం వలన కంటి చూపుకి శాశ్వత నష్టం కలిగించి అంధత్వానికి దారి తీయవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)