AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Line: ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే లైన్.. ఇది ఎక్కడ ఉందో తెలుసా?

ప్రయాణీకులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా వెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దూరం వరకు రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. దీని కోసం అమెరికా, చైనా, రష్యా, భారతదేశం బలమైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు..

Railway Line: ప్రపంచంలోనే అతి చిన్న రైల్వే లైన్.. ఇది ఎక్కడ ఉందో తెలుసా?
Railways Track
Subhash Goud
|

Updated on: Mar 11, 2024 | 4:03 PM

Share

ప్రయాణీకులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా వెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దూరం వరకు రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. దీని కోసం అమెరికా, చైనా, రష్యా, భారతదేశం బలమైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అంతే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రజల సౌకర్యార్థం రైలు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రపంచంలోనే అతి చిన్న రైలు నెట్‌వర్క్ ఎక్కడ ఉందో తెలుసా? మీరు కాలినడకన దాటగలిగే అతి చిన్న రైల్వే లైన్ ఉంది. అది ఎక్కడుందో తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఒకటిగా ఉన్న వాటికన్ సిటీలో అతి తక్కువ రైల్వే లైన్ ఉంది. సమాచారం ప్రకారం, ఈ రైలు మార్గం పొడవు 300 మీటర్లు మాత్రమే. మీరు దాదాపు 2 నిమిషాల్లో కాలినడకన ఈ దూరాన్ని హాయిగా అధిగమించవచ్చు. వాస్తవానికి ఈ రైల్వే ట్రాక్‌పై ప్యాసింజర్‌ రైళ్ల కోసం కాదు. ఇది గూడ్స్ రైళ్ల కోసం మాత్రమే నిర్మించారు. ఈ దేశంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉంది. దీని పేరు సిట్టా వాటికానా. ఈ రైలు మార్గం 1934లో ప్రారంభించారు.

వాటికన్ సిటీలో ఉన్న ఈ రైల్వే లైన్ 300 మీటర్ల తర్వాత ఇటలీలోని రోమా శాన్ పియట్రో రైల్వే స్టేషన్‌కి కనెక్ట్ అవుతుంది. అయితే, 2015 సంవత్సరంలో మొదటిసారిగా సిట్టా వాటికానో రైల్వే స్టేషన్ నుండి ప్యాసింజర్ రైలు నడపడం ప్రారంభించింది. ఈ రైలు ఇటలీలోని క్యాజిల్ గాండోల్ఫోకు వెళ్లేది. అలాగే శనివారాల్లో మాత్రమే నడిచేది. అయితే ఈ ట్రాక్‌పై ఎక్కువగా సరుకు రవాణా రైళ్లు మాత్రమే నడుస్తాయి.

వాటికన్ సిటీకి మొదటి రైలు ఎప్పుడు చేరుకుంది?

ఇటలీ , వాటికన్ సిటీ రైల్వే లైన్లను కలుపుతూ ఒప్పందం జరిగిన మూడేళ్ల తర్వాత ట్రాక్ సిద్ధమైంది. దీని తరువాత మార్చి 1932లో మొదటి లోకోమోటివ్ ఇంజిన్ రైలు వాటికన్ సిటీలోకి ప్రవేశించింది. అయితే స్టేషన్ అధికారికంగా 2 అక్టోబర్ 1934న ప్రారంభించబడింది. స్టేషన్ భవనం 1929 -1933 మధ్య నిర్మించారు. ఇది ఆ సమయంలో తెల్ల పాలరాయితో నిర్మాణం జరిగింది. స్టేషన్ భవనంలో ఒక భాగం ప్రయాణీకుల స్టేషన్, వస్తువుల కార్యాలయంగా ఉపయోగించబడుతోంది. మరొక భాగంలో ఇప్పుడు వాటికన్ న్యూమిస్మాటిక్స్, ఫిలాటెలిక్ మ్యూజియంలు ఉన్నాయి.

ప్రపంచంలోనే అతి పొడవైన రైలు మార్గం

అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అమెరికా, చైనా, రష్యా, భారతదేశంతో ఉంది. అమెరికా 2.5 లక్షల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అయితే చైనా 1 లక్ష కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా, రష్యా 85 వేల 500 కిలోమీటర్లతో ఉండగా, భారతదేశం 65 వేల కిలోమీటర్లతో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు