AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే చాలు..మీ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది!

తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుందని చెబుతున్నారు. ఫలితంగా చెడు ప్రభావాలు మీపై పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే.. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu Tips : ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే చాలు..మీ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది!
Vasthu
Jyothi Gadda
|

Updated on: Aug 17, 2025 | 9:38 AM

Share

Vastu Tips: హిందూమతంలో వాస్తుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అందుకే ఇల్లు, కార్యాలయం, వ్యాపార ప్రదేశం ఏదైనా సరే అన్ని రకాలుగా వాస్తుపరంగా నిర్మిస్తారు. అయితే, ఇల్లు వాస్తు ప్రకారం కట్టుకుంటే సరిపోదు.. ఇంట్లోని వస్తువులు కూడా వాస్తు ప్రకారమే పెట్టుకోవాలని జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుందని చెబుతున్నారు. ఫలితంగా చెడు ప్రభావాలు మీపై పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే.. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెదురు, తులసి, మనీ ప్లాంట్స్ ఇంటికి తూర్పు లేదా ఉత్తరం వైపున ఉంచడం ఎంతో మంచిది. ఈశాన్య మూల అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. ఇక్కడ ధ్యానం చేయడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారం వెలుగు సోకేలా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తెలుపు, పసుపు లేదా పాస్టెల్ షేడ్స్‌లో ఉండే ప్రశాంతమైన లైట్లను ఇంట్లో ఉంచడం మంచిది. వాస్తు ప్రకారం, దక్షిణం లేదా తూర్పువైపు తలపెట్టి నిద్రపోవడం వలన ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. ఇంట్లో మూలలు చిందరవందరగా ఉంచకూడదు, దీని వలన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు.

ఇంట్లో విషాదకర​మైన లేదా హింసకు సంబంధించిన ఫోటోలను ఉంచడం మంచిది కాదు. రోజు సాయంత్రం దీపం వెలిగించండి. ప్రతి రోజు ఇంట్లో దీపం వెలిగించడం వలన నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ప్రవేశ ద్వారం వద్ద లేదా బాల్కనీ వద్ద అందమైన దీపాలు ఉంచడం వలన పాజిటివ్‌నెస్ పెరుగుతుంది. ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకోవడం కూడా శుభప్రదం అంటున్నారు. ఇవి మీ ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాకుండా.. పత్రికూల శక్తులను ఇంటి నుంచి పారదోలడంలో చాలా బాగా సహాయపడతాయి. వీటిని ఇంట్లో ఉంచడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పారిపోతుంది. ఇంట్లో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నింపుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..