ముసురులో ఫుల్ చిల్.. దండిగా చేపల వేట.. దొరికినోడికి దొరికినంత..!
గతకొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎటు చూడు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోజువారీ కూలీలు, రైతులు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో సరదాగా చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చేపలు పడుతూ చిల్ అవుతున్నారు.. దొరికినకాడికి ఇంటికి తీసుకెళ్లి ముసురులో చేపల పులుసు రుచి చూస్తున్నారు. ఇంతకీ ఎక్కడా చేపలవేట.. లెట్స్ వాచ్..
గతకొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎటు చూడు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాగబోయినగూడెంలో చెరువులు అలుగు పోస్తున్నాయి. ఫలితంగా నాలుగు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోజువారీ కూలీలు, రైతులు కూడా ఇంట్లోంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో సరదాగా చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు రాగబోయినగూడెం వాసులు. అలుగు దగ్గర వలలతో ఉత్సాహంగా చేపలు పడుతూ చిల్ అవుతున్నారు. దొరికినకాడికి సంచిల్లో వేసుకుని వెళ్లిపోతున్నారు. అయితే ఈ చేపల వేటపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే ప్రమాదం ఉందంటున్నారు. అయినా లెక్క చేయకుండా కొందరు చేపల వేట సాగిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నో ఎంట్రీ బోర్డులు పెట్టినా పట్టించుకోవట్లేదంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
సంకల్ప బలం.. చేతులతోనే ఎవరెస్ట్ ఎక్కిన మాజీ సైనికుడు
పిల్లల్ని కన్న తర్వాత ఆక్టోపస్ ఎందుకు చనిపోతుంది?
'ఫ్రెంచ్ సండే' ప్రత్యేకత ఏంటో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
కాలానికి తగ్గట్టు రంగు మార్చే పక్షిని చూశారా
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్‌జీపీటీ ‘ఓకే’ అంటేనే..

