Tirumala: పోలీసుల సమయస్ఫూర్తి.. సీపీఆర్‌తో భక్తుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్!
తిరుమల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ భక్తుడి ప్రాణం కాపాడారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన మేడం శ్రీనివాసులు కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. దర్శనం అయ్యాక లడ్డూ ప్రసాదాల కోసం కౌంటర్ దగ్గరికి వెళ్లారు. ఉన్నట్టుండి శ్రీనివాసులు కుప్పకూలిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్‌టౌన్ కానిస్టేబుల్ గురప్ప తక్షణమే స్పందించి సీపీఆర్ చేశారు.

తిరుమల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ భక్తుడి ప్రాణం కాపాడారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన మేడం శ్రీనివాసులు కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. దర్శనం అయ్యాక లడ్డూ ప్రసాదాల కోసం కౌంటర్ దగ్గరికి వెళ్లారు. ఉన్నట్టుండి శ్రీనివాసులు కుప్పకూలిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్‌టౌన్ కానిస్టేబుల్ గురప్ప తక్షణమే స్పందించి సీపీఆర్ చేశారు. గుండెపోటుకు గురైన శ్రీనివాస్‌ను అశ్విని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ గురప్పపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆగస్టు 15వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి కి చెందిన 61 ఏళ్ల మేడం శ్రీనివాసులు స్వామివారిని దర్శనం కోసం తిరుమల వచ్చాడు. కుటుంబ సభ్యులతో పాటు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రాత్రి 9:30 గంటలకు లడ్డు ప్రసాదాలు తీసుకుని, లడ్డు కౌంటర్ల వద్ద నుండి మ్యూజియం వైపునకు వెళుతున్నాడు. పడమర మాడా వీధిలో ఉన్నట్లుండి శ్రీనివాసులు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు భక్తులు అల్లాడిపోయారు.
అదే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ గుర్రప్ప గమనించాడు. గుండెపోటుగా భావించి సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. CPR చేసి భక్తుడి ప్రాణాలను కాపాడాడు. భక్తుడు కొంచెం కోలుకోగా వెంటనే అతనిని అక్కడి నుండి అంబులెన్స్‌లో తిరుమల అశ్విని ఆసుపత్రికి చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం భక్తుడిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. తిరుపతి స్విమ్స్‌లో మెరుగైన చికిత్స పొందిన శ్రీనివాసులు ప్రాణాలతో బయట పడ్డాడు. ఎలాంటి సమస్య లేకపోవడంతో డాక్టర్లు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో కోలుకున్న భక్తుడు శ్రీనివాసులు సొంతూరు వెళ్లిపోగా.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ గుర్రప్పను భక్తులు అధికారులు అభినందించారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
