AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉంటే ఏమౌతుందో తెలుసా..? అశుభానికి శ్రీకారం అక్కడి నుంచే..!

హిందూ మతంలో వాస్తుకు అత్యంత ప్రాధాన్యనిస్తారు. ఇల్లు ఏ దిక్కున నిర్మించుకోవాలి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి. ఇంటి ప్రవేశ ద్వారాం, గేట్ ఎలా ఉండాలి..? ఇంటి ముందు ఎలాంటి మొక్కలు, చెట్లు పెంచుకోవాలి. వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి.. ఎలాంటి చెట్లు నాటుకోవాలి.? వంటి అనేక అంశాలు వాస్తులో ప్రస్తావించారు. అయితే, ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టు పెడితే ఏమౌతుందో తెలుసా...? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Vastu Tips: ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉంటే ఏమౌతుందో తెలుసా..? అశుభానికి శ్రీకారం అక్కడి నుంచే..!
Papaya Tree
Jyothi Gadda
|

Updated on: Sep 26, 2025 | 7:15 PM

Share

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమకు ఉన్న స్థలంలోనే ఏదో ఒక పూలు, పండ్ల చెట్లను పెంచుతున్నారు. ఇది మంచి అలవాటు. కానీ, మీరు మీ ఇంటి ఆవరణలో పెంచే చెట్లు, మొక్కలు మీ ఇంటి వాస్తును ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..? కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో పెంచటం వల్ల ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటిదే బొప్పాయి కూడా ఒకటి.. వాస్తు శాస్త్రం ప్రకారం.. బొప్పాయి చెట్టు ఇంటి ముందు ఉండటం మంచిది కాదని చెబుతారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు పొరపాటున పెరిగినా కూడా దాన్ని వెంటనే పీకి మరో చోట నాటాలని వాస్తు శాస్త్రనిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే.. ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచటం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత, సంతోషాలు దూరం అవుతాయని అంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటకూడదని చెబుతుంటారు. వాస్తు ప్రకారం.. ఇంటి చుట్టు ముట్టూ కూడా బొప్పాయి చెట్టును నాటకూడదని అంటున్నారు. ఎందుకంటే బొప్పాయి చెట్టు అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఇంటి ఆవరణలో బొప్పాయి మొక్కను నాటితే ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు వెంటాడుతాయని చెబుతున్నారు.

అంతేకాదు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి చెట్టు పూర్వీకుల నివాసంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టును ఇంటి దగ్గర, ఇంటి ముందు నాటకూడదని అంటున్నారు. ఇంటి ముందు, ఆవరణలో బొప్పాయి చెట్టు ఉండటం వల్ల పిల్లలకు ఎప్పుడూ బాధలు, కష్టాలు వస్తాయని అంటున్నారు. అందుకే ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటడం మంచిది కాదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కథనంలోని వాస్తు వివరాలు, సలహాలు పూర్తిగా ప్రాచీన నమ్మకాలు, ఆధ్యాత్మిక సూత్రాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఈ సమాచారాన్ని ఎంతవరకూ విశ్వసించాలి, పాటించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం, విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే