AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Kamalam: కృష్ణ కమలం ఎప్పుడైనా చూసారా..? ఈ పువ్వులో దాగిన అనేక రహస్యాలు..!

మనిషికి ప్రకృతికి విడదీయలేని బంధం ఉంది. ఈ ప్రకృతిలో మనకు తెలిసిన అద్భుతాలు కొన్ని ఉంటే, తెలియనివి ఎన్నో ఉన్నాయి. కొన్ని అద్భుతాలు మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగివున్నాయి. హిందూ ధర్మంలో పంచమ వేదంగా ప్రఖ్యాతిగాంచిన మహా భారతం మొత్తం ఒక పుష్పంలో ఉంది. ఎంతో అందంగా కనిపించి కనువిందు చేసే ఈ పువ్వులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయనేది పూర్వీకులు చెపుతున్నారు.

Krishna Kamalam: కృష్ణ కమలం ఎప్పుడైనా చూసారా..? ఈ పువ్వులో దాగిన అనేక రహస్యాలు..!
Krishna Kamalam
N Narayana Rao
| Edited By: |

Updated on: Apr 15, 2024 | 7:43 PM

Share

మనిషికి ప్రకృతికి విడదీయలేని బంధం ఉంది. ఈ ప్రకృతిలో మనకు తెలిసిన అద్భుతాలు కొన్ని ఉంటే, తెలియనివి ఎన్నో ఉన్నాయి. కొన్ని అద్భుతాలు మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగివున్నాయి. హిందూ ధర్మంలో పంచమ వేదంగా ప్రఖ్యాతిగాంచిన మహా భారతం మొత్తం ఒక పుష్పంలో ఉంది. ఎంతో అందంగా కనిపించి కనువిందు చేసే ఈ పువ్వులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయనేది పూర్వీకులు చెపుతున్నారు.

మూడు సంవత్సరాలకు ఒకసారి వికసించే ఈ పుష్పం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామానికి చెందిన దండా సత్యనారాయణ ఇంట్లో వికసించింది. గత ఆరు నెలల క్రితం ఈ మొక్కను హైదరాబాద్‌లో తీసుకురాగా ఇప్పుడు పువ్వు పూయడంతో కృష్ణ కమలాన్ని గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు. వాడుక భాషలో ఈ పుష్పాన్ని కౌరవ-పాండవ పువ్వు అని పిలుస్తారు. కృష్ణ కమలం అని కూడా మరో పేరు ఉంది.

మూడేళ్లకు ఒకసారి వికసించే ఈ కృష్ణ కమలం మొత్తం మహాభారత కథని వివరిస్తుందని నమ్ముతారు. కౌరవులు, పాండవులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శ్రీకృష్ణుడు అందరూ ఈ పుష్పంలో ఉన్నారనేది ప్రచారంలో ఉంది. కృష్ణ కమలం పుష్పం చుట్టూ సన్నని తీగ వంటి పెటల్స్ ఉంటాయి. ఈ పూరేకుల సంఖ్య 100కు పైగా ఉంటాయి. ఇవి కౌరవులకు చెందినవిగా భావిస్తారు. ఆపైన ఐదు రెక్కలుంటాయి. వీటిని పాండవులకు చిహ్నంగా భావిస్తారు. ఆ ఐదు రెక్కలపై మూడు రెక్కలు కొలువై ఉన్నాయి. వాటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లుగా అభివర్ణిస్తారు. మధ్యలో సుదర్శన చక్రం ఆకారంగా ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడికి ప్రతీకగా భావిస్తారు. ఈ కౌరవ-పాండవ పుష్పం గురించి అనేక జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే ఈ పుష్పాన్ని హిందూ ఆరాధ్యంగా పూజిస్తారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…