AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Non Veg Food: దేశంలో మాంసాహారం ఎక్కువగా ఏ రాష్ట్రంలో తింటున్నారో తెలుసా? షాకింగ్ సర్వే

Non Vegetarian Food Consumption: భారతదేశంలో మాంసాహారం వినియోగం పెరుగుతోంది. నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలలో 99 శాతం మందికి పైగా మాంసాహారం తింటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మాంసాహారం ఎక్కువగా తీసుకుంటారు. ఈ రాష్ట్రాలలో మాంసాహార ప్రియులు 98 శాతం వరకు ఉన్నారు. తమిళనాడు, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా మాంసాహారానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. NFHS సర్వే ప్రకారం, 85 శాతం భారతీయులు నాన్-వెజిటేరియన్ ఆహారం ఇష్టపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో చేపలు, చికెన్ వంటి మాంసాహారాలతో చేసిన వంటకాలను తింటున్నారు.

Non Veg Food: దేశంలో మాంసాహారం ఎక్కువగా ఏ రాష్ట్రంలో తింటున్నారో తెలుసా? షాకింగ్ సర్వే
మాంసం, సముద్ర ఆహారాల్లో కూడా ప్రోటీన్, బయోటిన్ అధికంగా ఉంటాయి. మాంసం, సముద్ర ఆహారం తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Prashanthi V
| Edited By: |

Updated on: Jan 18, 2025 | 1:41 PM

Share

మన భారతదేశంలో అనేక రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో మాంసాహారం ప్రోటీన్లు, విటమిన్ల వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఈ కారణంగా చాలా మంది భారతీయులు నాన్‌-వెజిటేరియన్ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. ఒక సర్వే ప్రకారం దేశ జనాభాలో 85 శాతం మంది నాన్ వెజ్ తింటున్నారట. మరి భారతదేశంలో ఎక్కువగా మాంసం తినే రాష్ట్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నాన్ వెజ్ ప్రియులు

భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ మంది శాకాహారులు ఉన్న దేశం. అయినప్పటికీ, నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని ఇష్టపడేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువ. 2015-16లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-4) ప్రకారం, వారానికి 78 శాతం మహిళలు, 70 శాతం పురుషులు చేపలు, చికెన్ లేదా ఇతర మాంసాహారం తింటున్నారట. కొన్ని రాష్ట్రాల్లో నాన్ వెజ్ ప్రియుల సంఖ్య 100 శాతం వరకు ఉంది.

టాప్ ప్లేస్‌లో నాగాలాండ్

నాన్-వెజిటేరియన్ ఆహారం ఎక్కువగా తినే రాష్ట్రాల్లో నాగాలాండ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 99.8 శాతం మంది మాంసాహారం తింటారు. ఇక్కడి ప్రత్యేక వంటకాల్లో స్మోక్ చికెన్, మటన్, బాంబూ స్టైల్ చేపల వంటలు ఉంటాయి. అలాగే, పశ్చిమ బెంగాల్ 99.3 శాతంతో రెండో స్థానంలో ఉండగా, కేరళ 99.1 శాతంతో మూడవ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాలు చేపలు, చికెన్, ఇతర మాంసంతో తయారయ్యే రుచికరమైన వంటకాలతో ప్రసిద్ధి చెందాయి.

తెలుగు రాష్ట్రాల ప్రత్యేకత

తెలుగు రాష్ట్రాలు మాంసాహార వినియోగంలో మరింత ముందుండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ 98.25 శాతం జనాభాతో నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని ఎక్కువగా తినే రాష్ట్రాలలో నాలుగో స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో మగవాళ్లలో 98.8 శాతం, ఆడవాళ్లలో 98.6 శాతం మంది మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. ఇక్కడ వెజిటేరియన్ల సంఖ్య కేవలం 2 శాతం లోపే ఉంది.

ఇతర రాష్ట్రాల వివరాలు

తమిళనాడు 97.65 శాతం జనాభాతో నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడే రాష్ట్రాలలో ఒకటి. ఒడిశాలో 97.35 శాతం మంది ప్రజలు సముద్ర ఆహారం, ఇతర మాంసాహార వంటకాలను ఇష్టపడుతారు. అయితే పంజాబ్‌లో నాన్-వెజిటేరియన్ వినియోగం తక్కువగా ఉంది. అక్కడ నెలకు సగటున 205 గ్రాముల చికెన్, 3 గుడ్లను మాత్రమే తీసుకుంటారు. ఇది ఈశాన్య, దక్షిణ భారత రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ.

మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..