AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న తెలుగింటి మహిళా రైతు.. ప్రకృతి సేద్యంతో పంటసిరులు

సమాజంలో సగభాగమైన తాము పురుషులతో తక్కువేమీ కాదని ఇప్పటికే నిరూపించారు చాలా మంది మహిళలు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో రాణించి మన్ననలు పొందారు.

వారెవ్వా.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న తెలుగింటి మహిళా రైతు.. ప్రకృతి సేద్యంతో పంటసిరులు
Ram Naramaneni
|

Updated on: Feb 22, 2021 | 8:43 PM

Share

సమాజంలో సగభాగమైన తాము పురుషులతో తక్కువేమీ కాదని ఇప్పటికే నిరూపించారు చాలా మంది మహిళలు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో రాణించి మన్ననలు పొందారు. కానీ..వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితుల్లో, వ్యవసాయాన్నిఛాలెంజ్ గా తీసుకొని..కొత్త పద్ధతిలో సేద్యం చేసి భేష్ అనిపించుకున్నారు ఈ మహిళ. ఆర్థికంగా ఎదగడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. భూములు అమ్ముకునే స్థాయి నుంచి తన పేర ఓ ప్రొడక్టును సమాజానికి అందించే వరకు ఎదిగిన ఈమె…నేటి సమాజానికి ఓ ఉదాహరణ…ఆదర్శం.

‘అప్పుల పాలై ఆత్మహత్మాభిమానం పోగొట్టుకోకూడదనే పట్టుదలే నన్ను మోల్కొలిపింది. ఎంతో మంది రైతులు పడిన కష్టాలే నావి..వాటన్నింటినీ గుండె నిబ్బంరంతో తట్టుకుని, సేద్యాన్ని కొత్త మార్గంలో కొత్త పుంతలు తొక్కించడంతో బయటపడ్డాను’ అంటున్నారు నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన లావణ్య. తీవ్ర వర్షాభావం వల్ల పాలమూరు జిల్లాలో కరువు తాండవించింది. దాన్ని అధిగమించే కొత్త ఉపాయం కావాలి. సరిగ్గా లావణ్య కుటుంబం ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడు…తెలకపల్లి వ్యవసాయాధికారి హుస్సేన్ బాబు వీరికి సేంద్రీయ వ్యవసాయాన్ని పరిచయం చేశారు. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న లావణ్య సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను బాగా అర్థం చేసుకున్నారు. దాంతో రసాయన ఎరువుల వాడకానికి స్వస్తి చెప్పారు.

గోమూత్రం, పేడలతో కీటకనాశని, కశాయాలు తయారు చేయడం నేర్చుకున్నారు. మురిగిన కోడిగుడ్లు, గోమూత్రంతో చేసిని కషాయం పంటలకు పిచికారి చేశారు. ఫలితం బాగానే ఉంది. ఒక్క ఆవుతో 30 ఎకరాల పంటకు సరిపడే సేంద్రీయ ఎరువులను తయారు చేసుకున్నారు. క్రిమిసంహారక మందులకు ఎకరా పత్తికి పాతిక వేలు ఖర్చు వచ్చేది. సేంద్రీయ ఎరువులకు పది వేలు మాత్రమే ఖర్చవుతుంది. దీంతో ఈ పద్ధతి లాభ సాటిగా ఉందని భావించారు లావణ్య. కొంత కష్టమైనప్పటికీ సేంద్రీయ పద్ధతిలోనే పంటలు పండించాలని నిర్ణయించుకున్నారు. భర్త సహకారంతో 15 రకాల పంటలను సేంద్రీయ పద్ధతిలో పండిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. 2002 నుంచి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించారు లావణ్య.

ప్రధాన పంటలుగా వరి, పత్తి, మిర్చి పంటలు వేస్తూ…వాటిల్లో అంతర పంటలుగా దనియాలు, మెంతులు, సోంఫు, కాబూలి శనగ, బఠానీ, ఆవాలు పండిస్తున్నారు. ఈ పంటలకు పూర్తిగా సేంద్రీయ ఎరువులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. తన వద్ద ఉన్న దేశీ ఆవు పేడ, మూత్రంతో దశపర్నికషాయం, నవరత్నాల కషాయంతో పాటు పంచామృతాన్ని పంటలకు ఉపయోగిస్తున్నారు.

పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ప్రజలకు మంచి నాణ్యమైన సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలు అందించడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లావణ్యను గుర్తించాయి. అనేక అవార్డులతో సత్కరించాయి. 2015 మార్చిలో తెలంగాణా ప్రభుత్వం ఉత్తమ రైతు అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదుతో సత్కరించింది. 2015లో కేంద్ర ప్రభుత్వం కిసాన్ ఉన్నతి అవార్డుతో సత్కరించింది. ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వారు క్రిషీ రత్న అవార్డు ప్రధానం చేశారు. 2016లో వందేమాతరం ఫౌండేషన్ కూడా అవార్డుతో సత్కరించింది. ఇలా వివిధ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 25 అవార్డులను దక్కించుకున్నారు లావణ్య.

సేంద్రీయ పద్ధతిలో పండించే పంటలకు డిమాండ్ కూడా పెరిగింది. ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చి లావణ్య వ్యవసాయం చేసే పద్ధతులను చూసి వెళ్తున్నారు. అంతేగాక లావణ్య పండించిన పంటలకు బాగా డిమాండ్ పెరిగింది. చాలా మంది కారువంగ గ్రామానికి వచ్చి కొనుక్కొని వెల్తున్నారు. తమ ప్రొడక్టుకు డిమాండ్ పెరగడంతో లావణ్య పేరుతో ప్రొడక్టులు విక్రయిస్తున్నారు సదరు మహిళా రైతు.

Also Read:

ఓటీటీ ఎపిసోడ్ల మాదిరిగా పోర్న్ కంటెంట్.. వారానికో ఎపిసోడ్ రిలీజ్.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు

నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది

చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో