Statue of Wife: చనిపోయిన భార్యకు గుడి కట్టిన భర్త.. మండపంలో విగ్రహం ప్రతిష్టించి నిత్యం పూజలు.. ఎక్కడంటే?

భౌతికంగా దూరమైనా...వాళ్ల మనసులో ఆమె ఇంకా సజీవంగానే ఉంది. ప్రాణంతో ఉంటేనే కాదు...ఆమె పంచిన ప్రేమను వాళ్లు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబందాలుగా మారుతున్న ఈ రోజుల్లో చనిపోయిన భార్యకు గుడి కట్టించి.. విగ్రహం ఏర్పాటు ఆరాదీస్తున్నారు.

Statue of Wife: చనిపోయిన భార్యకు గుడి కట్టిన భర్త.. మండపంలో విగ్రహం ప్రతిష్టించి నిత్యం పూజలు.. ఎక్కడంటే?
Statue Of Wife
Follow us

|

Updated on: Nov 17, 2021 | 7:02 AM

Man puts Statue of Wife: భౌతికంగా దూరమైనా…వాళ్ల మనసులో ఆమె ఇంకా సజీవంగానే ఉంది. ప్రాణంతో ఉంటేనే కాదు…ఆమె పంచిన ప్రేమను వాళ్లు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. మానవ సంబంధాలన్ని ఆర్ధిక సంబందాలుగా మారుతున్న ఈ రోజుల్లో చనిపోయిన భార్యకు గుడి కట్టించి.. విగ్రహం ఏర్పాటు ఆరాదీస్తున్నారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది.

ఏ బంధం చివరి వరకు కొనసాగుతుందో చెప్పలేం. కాని వాళ్ల మనసుల్లో పెనవేసుకున్న అనుబంధం మాత్రం జన్మజన్మలకు పదిలంగా ఉండాలనుకున్నారు. జోగులాంబ గద్వాల పట్టణానికి చెందిన గంటలబోయిన హన్మంతు భార్యపై తనకున్న ప్రేమకు గుర్తుగా ఏకంగా గుడినే కట్టించాడు. 82ఏళ్ల ఈ పెద్దాయన …రెండేళ్ల క్రితం భార్య రంగమ్మను కోల్పోయాడు. సహధర్మచారిణి లేని లోటును తట్టుకోలేకపోయాడు. ఆమె ఎప్పటికి తమ కళ్ల ముందే ఉండాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా రాజస్థాన్‌ శిల్పులతో భార్య విగ్రహాన్ని తయారు చేయించి.. తన ఇంటి ఆవరణలోనే మండపం కట్టి అందులో విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నాడు.

ఊళ్లో పెద్దల సహకారంతో గతంలో శివరామాంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించాడు హన్మంతు. ఆ గుడి పక్కనే ఉన్న తన పొలంలో భార్యకు ఓ మండపం కట్టించి.. అందులోనే విగ్రహాన్ని ప్రతిష్టించాడు. హన్మంతుకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలతో పాటు మనవళ్లు, మనుమరాళ్లు ఉన్నారు. హన్మంతు చాటుకున్న ప్రేమను చూసి వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, చనిపోయిన భార్యకు గుడి కట్టించి.. విగ్రహం ఏర్పాటు చేసుకున్న హన్మంతుకు భార్యపై ఉన్న ప్రేమను వెలకట్టేలమంటున్నారు స్థానికులు.

Read Also… Baby Elephant: వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న గున్న ఏనుగు.. తొండం కోల్పోయి మృతి.. రోజు రోజుకీ అంతరించిపోతున్న జాతి