Horoscope Today: ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.. బుధవారం రాశిఫలాలు

Today Horoscope: కొన్ని సందర్భాల్లో ముందు, వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలామంది ఇబ్బందుల్లో పడుతుంటారు. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా,

Horoscope Today: ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.. బుధవారం రాశిఫలాలు
Horoscope Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 17, 2021 | 6:59 AM

Today Horoscope: కొన్ని సందర్భాల్లో ముందు, వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలామంది ఇబ్బందుల్లో పడుతుంటారు. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. ఈ రోజు (నవంబర్ 17న) బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం..

మేషం: ఈ రాశివారు ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంతో ముందుకుసాగుతారు. బంధుమిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం: ఈ రోజు ఈ రాశివారు ధైర్యంతో ముందడుగు వేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలు, బంధుమిత్రుల నుంచి సాయం అందుతుంది. కొందరినుంచి ప్రశంసలు అందుకుంటారు.

మిథునం: ఈ రాశి వారు ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పలు వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది.

కర్కాటకం: ఈ రోజు ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. ప్రాయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

సింహం: ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి.

కన్య: ఈ రోజు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగి పేరును గడిస్తారు. గొడవలకు దూరంగా ఉండాలి.

తుల: ఈ రాశి వారు సమయానుకూలంగా ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రశాంతత కోసం సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. బంధుమిత్రుల నుంచి సాయం అందుతుంది.

వృశ్చికం: ఈ రాశి వారికి ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం అందుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనుస్సు: చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శుభవార్త సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య వ్యవహారంలో బంధువుల నుంచి ఆర్థికసాయం అందుతుంది. ఆరోగ్యం దృష్టిపెట్టాలి.

మకరం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని పనుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

కుంభం: చేపట్టిన పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. తోటివారి సహకారంతో ఇబ్బందులను అధిగమిస్తారు. వాదనలకు దూరంగా ఉండాలి.

మీనం: ఈ రాశి వారికి ఒత్తిడితో కూడిన ఫలితాలు ఉంటాయి. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. క్షమాగుణంతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది.

Also Read:

Ap Weather: ‘జవాద్‌’ ఎఫెక్ట్‌.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

Delhi Pollution: నవంబర్ 21 వరకు విద్యాసంస్థలు మూసివేయండి.. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఆదేశం..