Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: కిరోసిన్ దీపం వెలుగులో చదువుకుని సివిల్స్ క్రాక్ చేసిన యువకుడు.. ఈ ఐఏఎస్ ఆఫీసర్ జీవితమే ఓ సంచలనం..!

అలాంటి స్పూర్తిదాయకమైన సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అన్షుమన్ రాజ. కొందరు ఆశావహులు సివిల్స్ లో గట్టెక్కడం కోసం సంవత్సరాలకి సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు. అయితే ఐఏఎస్ అన్షుమన్ రాజ్ వంటి కొందరు అసాధారణ ఆశావహులు మాత్రమే ఎటువంటి కోచింగ్ లేకుండానే పరీక్షలో ఉత్తీర్ణత సాదిస్తూ చరిత్ర సృష్టిస్తారు. అన్షుమాన్ ది బీహార్‌లోని బక్సర్ జిల్లాలో అతి పేద కుటుంబం. ఇంట్లో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేని పేదరిక కుటుంబం. 10వ తరగతి వరకు కిరోసిన్ దీపం వెలుగులోనే చదువుకున్నాడు.

Success Story: కిరోసిన్ దీపం వెలుగులో చదువుకుని సివిల్స్ క్రాక్ చేసిన యువకుడు.. ఈ ఐఏఎస్ ఆఫీసర్ జీవితమే ఓ సంచలనం..!
Ias Anshuman Raj
Surya Kala
|

Updated on: Jan 02, 2024 | 10:57 AM

Share

మన దేశంలో సివిల్ సర్వీస్ అంటే యువతీ యువకులకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మరీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతూ ఉంటారు. లక్షలాది మంది యుపిఎస్‌సి ఆశావహులు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (సిఎస్‌ఇ)కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇందు కోసం కొందరు అయితే ఏకంగా లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తారు. అయితే భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలో ఒకటి సివిల్ సర్వీస్ పరీక్ష. ఇలాంటి పరీక్షలో ఉత్తీర్ణత కోసం కోచింగ్ సెంటర్స్ ను ఆశ్రయించే వాళ్లు ఎక్కువే.. అయితే సివిల్ లో ఎటువంటి కోచింగ్ లేకుండానే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కొందరు ఉన్నారు. అటువంటి వారు పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తారు.

అలాంటి స్పూర్తిదాయకమైన సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అన్షుమన్ రాజ్. కొందరు ఆశావహులు సివిల్స్ లో గట్టెక్కడం కోసం సంవత్సరాలకి సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు. అయితే ఐఏఎస్ అన్షుమన్ రాజ్ వంటి కొందరు అసాధారణ ఆశావహులు మాత్రమే ఎటువంటి కోచింగ్ లేకుండానే పరీక్షలో ఉత్తీర్ణత సాదిస్తూ చరిత్ర సృష్టిస్తారు.

ఇవి కూడా చదవండి

అన్షుమాన్ ది బీహార్‌లోని బక్సర్ జిల్లాలో అతి పేద కుటుంబం. ఇంట్లో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేని పేదరిక కుటుంబం. 10వ తరగతి వరకు కిరోసిన్ దీపం వెలుగులోనే చదువుకున్నాడు. ఇంట్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో మొదటినుంచీ చదువులో మాత్రమే కాదు అన్ని విషయాల్లో కష్టాలు పడాల్సి వచ్చింది. డబ్బుల కోసం ఇబ్బంది. వనరుల కొరతతో తన చదువుకోసం తానే కష్టపడడం మొదలు పెట్టారు.

తన 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత.. జవహర్‌లాల్ నవోదయ విద్యాలయ (JNV)లో చేరాడు. అక్కడ  12వ తరగతి, గ్రాడ్యుయేషన్‌ను అభ్యసించాడు. జేఎన్‌వీలో చదువుతున్న సమయంలోనే యూపీఎస్సీ కి ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నాడు.

అయితే అన్షుమాన్ కోరిక తీర్చే ఆర్ధిక స్తొమత అతని కుటుంబానికి లేదు. UPSC కల తీర్చే సివిల్ పరీక్ష ప్రిపేర్ కు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నాడు. ఢిల్లీలో ప్రిపరేషన్ ఖర్చులను తన కుటుంబం  భరించలేకపోయినప్పటికీ.. తన తన విధిరాతను మార్చుకోవడానికి తానే పోరాడాలని నిర్ణయించుకున్నారు. తన తల్లిదండ్రులను కానీ,  పూర్వీకుల ఆస్తిని,  భూమిని విక్రయించమని అడగాలని అనుకోలేదు. తానే ఎటువంటి కోచింగ్ లేకుండా స్వయంగా సివిల్స్ కు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాడు.. ఈ విషయాన్నీ DNA ఇండియా పేర్కొంది.

తన స్నేహితుల నుంచి పరిచయస్తుల నుంచి నోట్స్ సేకరించడం మొదలు పెట్టాడు. ఇందు కోసం చాలా కష్టపడ్డాడు.. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా అసలు వదులుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు. కృషి, పట్టుదలతో సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. విజయవంతంగా IRS పదవిని పొందాడు. అయితే తన కల ఐఏఎస్‌ కావాలని … కనుక మళ్లీ సివిల్స్ కు ప్రిపేర్ అవ్వాలని మరొకసారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి అన్షుమాన్ UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షను క్రాక్ చేశాడు. CSE లో AIR-107 రాంక్ సాధించడంతో తన  కలను నిజం చేసుకున్నాడు. కిరోసిన్ దీపం కింద చదువుకోవడం నుండి IAS అధికారి అయ్యే వరకు అన్షుమాన్ చదువు అద్భుతమైన ప్రయాణం నేటి యువతికి స్ఫూర్తి. తమ అభివృద్ధికి, చదువుకు తమ ఆర్ధిక ఇబ్బందులే కారణం అతను కొంటామని నిరాశను వ్యక్తం చేస్తారు.  అటువంటి వారికీ నిజమైన ప్రేరణ ఇలాంటి వ్యక్తులే..

మరిన్ని  హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..