AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్థికంగా స్థిరపడటానికి 3 ముఖ్యమైన టిప్స్ ! ఇలా చేస్తే మీకు డబ్బు సమస్య అసలే రాదు !

మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలంటే, సరైన ప్రణాళిక అవసరం. జీతం వచ్చిన వెంటనే అనవసర ఖర్చుల నుండి తప్పించుకొని, భవిష్యత్తుకు కొంత డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. ప్రతి నెలా కనీసం 20 శాతం డబ్బును పెట్టుబడిగా పెట్టడం, అత్యవసర ఫండ్ తయారు చేయడం, హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం ముఖ్యమైనవి. తక్కువ ఆదాయం ఉన్నా కూడా, ఆర్థిక స్థిరత్వం కోసం బడ్జెట్ రూపొందించి, డబ్బును పక్కకు పెట్టుకోవడం ముఖ్యం.

ఆర్థికంగా స్థిరపడటానికి 3 ముఖ్యమైన టిప్స్ ! ఇలా చేస్తే మీకు డబ్బు సమస్య అసలే రాదు !
Money Savings Tips
Prashanthi V
|

Updated on: Jan 17, 2025 | 10:17 AM

Share

మన జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆర్థిక పరిస్థితి నేరుగా ప్రభావం చూపుతుంది. కొంతమంది తక్కువ సంపాదనతో కూడా సంతోషంగా గడుపుతారు. మరికొంతమంది ఎక్కువగా సంపాదించినా ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంటారు. డబ్బు సంపాదించడమే కాదు.. దానిని సరిగ్గా ఖర్చు చేయడం కూడా చాలా ముఖ్యం. తక్కువ ఆదాయంతో కూడా డబ్బును ఎలా బాగా సేవ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు ముఖ్యం ?

డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని ఖర్చు చేయడం కూడా అంత ముఖ్యమైన పని. అయితే ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. జీతం వచ్చిన వెంటనే అనవసరంగా ఖర్చు చేస్తూ, నెల చివర్లో డబ్బు లేకపోవడం అనేది చాలామందికి ఎదురయ్యే సమస్య. దీన్ని మార్చాలంటే, ఆర్థిక నిర్వహణలో స్పష్టత అవసరం. జీతం ఎక్కువైనా, తక్కువైనా, మీ భవిష్యత్‌ కోసం కొంత డబ్బును దాచుకోవడం చాలా ముఖ్యం.

ఆర్థికంగా స్థిరపడటానికి 3 ముఖ్యమైన టిప్స్

పెట్టుబడిని ప్రారంభించండి

సంపాదించే మొత్తం నుంచి కనీసం 20 శాతం డబ్బును ప్రతి నెలా పెట్టుబడిగా పెట్టండి. అది చిన్న మొత్తమైనా సరే, సరైన ప్రణాళికతో పెట్టుబడిని ప్రారంభించడం వల్ల భవిష్యత్‌లో మంచి ఫలితాలు ఉంటాయి. మీ పెట్టుబడులు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్ సురక్షితంగా ఉంటుంది.

అత్యవసర కోసం కొంత డబ్బు

కుటుంబానికి సంబంధించిన అవసరాలకు వెంటనే డబ్బు అవసరం అవుతుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో ఇతరులను ఆశ్రయించడం కన్నా.. అత్యవసర కోసం కొంత డబ్బును పక్కకు పెట్టుకోవడం మంచిది. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపోయే డబ్బును సేవ్ చేసుకోండి. ఉద్యోగం కోల్పోవడం, వ్యాపార నష్టాలు లేదా ఇతర సమస్యలు వచ్చినప్పుడు ఈ డబ్బు మీకు ఉపయోగపడుతుంది.

హెల్త్ ఇన్సూరెన్స్

కరోనా తర్వాత ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరమని గుర్తించారు. వైద్య ఖర్చులు రోజు రోజుకూ పెరుగుతున్నందున, కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించడానికి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు కాకుండా.. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు అవసరమైన సహాయం అందిస్తుంది.

సేవింగ్ ఎలా చేయాలి ?

అనవసర ఖర్చులను తగ్గించండి. రోజువారీ జీవన విధానంలో చిన్నచిన్న మార్పులతో డబ్బును ఆదా చేయవచ్చు. అనవసర షాపింగ్ లేదా ఆన్‌లైన్ ఖర్చులను తగ్గించండి. కూరగాయలు, నిత్యావసరాల సరుకులు బల్క్‌లో కొనుగోలు చేయడం వల్ల మీరు ఎక్కువ డబ్బును ఆదా చేయవచ్చు. నెల అవసరాలను ముందే ప్లాన్ చేసి కొనుగోలు చేయడం మంచిది.

మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. బడ్జెట్‌ను తయారు చేయడం, ఖర్చులను ట్రాక్ చేయడం మొదలైనవి అనుసరించండి. ప్లాన్ చేసి ముందుకుసాగండి. నెల ఆఖర్లో కొంత డబ్బును సేవ్ చేయడం మంచిది. వివిధ బ్యాంక్ సేవింగ్ పథకాలు, ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులు పెట్టండి. పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్), ఎల్‌ఐసీ వంటి పథకాలు మంచి రాబడిని ఇస్తాయి. మీ కుటుంబ అవసరాలను బట్టి ఖర్చులు చేసుకుంటూ, భవిష్యత్తు కోసం డబ్బును దాచుకోండి.

ఆర్థికంగా బలపడేందుకు, డబ్బు సంపాదించడమే కాకుండా, దాన్ని సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ఈ మూడు టిప్స్‌ను అనుసరించి, ఆర్థిక సమస్యల నుంచి దూరంగా ఉండండి. కనీసం 6 నెలల అత్యవసరాలకు డబ్బును సిద్ధం చేసుకోవడం, సరైన హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం మీ భవిష్యత్‌కు రక్షణ కవచంలా పనిచేస్తాయి. మీ డబ్బును చక్కగా సేవ్ చేస్తూ, సురక్షిత జీవితాన్ని ఆస్వాదించండి.