Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు.. సూరత్-బిలిమోరా మధ్య విద్యుద్దీకరణ పనులు షురూ..!

బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణ పనులు బుల్లెట్‌ వేగంతో పరుగులు తీస్తున్నాయి. మోదీ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కీలక ప్రక్రియ పూర్తయింది. దేశంలో బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణ పనులు పట్టాలపై శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. అహ్మదాబాద్‌-ముంబై బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో కీలక ప్రక్రియ పూర్తయిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో షేర్‌ చేశారు.

శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు.. సూరత్-బిలిమోరా మధ్య విద్యుద్దీకరణ పనులు షురూ..!
Bullet Train
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 17, 2025 | 10:05 AM

గుజరాత్‌లో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ కోసం విద్యుదీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా భూమి నుండి 14 మీటర్ల ఎత్తులో గుజరాత్‌లోని సూరత్-బిలిమోరా బుల్లెట్ రైలు స్టేషన్ల మధ్య వయాడక్ట్‌పై మొదటి రెండు స్టీల్ మాస్ట్‌లను ఏర్పాటు చేశారు. మొత్తంగా, కారిడార్‌లో 9.5 నుండి 14.5 మీటర్ల ఎత్తులో 20,000 కంటే ఎక్కువ మాస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

ఓవర్ హెడ్ వైర్లు, ఎర్తింగ్ సిస్టమ్‌లు, ఫిట్టింగ్‌లు సంబంధిత ఉపకరణాలతో సహా ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (OHE) వ్యవస్థకు అనుసంధానిస్తారు. ఇది బుల్లెట్ రైళ్లను నడపడానికి అనువైన MAHSR కారిడార్ కోసం పూర్తి 2×25 KV ఓవర్ హెడ్ ట్రాక్షన్ సిస్టమ్‌ను నిర్మిస్తున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విధానాన్ని ప్రోత్సహిస్తూ, ఈ OHE మాస్ట్‌లు జపనీస్ స్టాండర్డ్ డిజైన్, స్పెసిఫికేషన్‌ల ప్రకారం భారతదేశంలో తయారు చేయడం జరిగింది. హై-స్పీడ్ రైళ్లకు ఓవర్‌హెడ్ ట్రాక్షన్‌కు కలుపుతారు. జనవరి 13 న, గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని నాడియాడ్ సమీపంలోని దభన్ గ్రామంలో ఓవర్‌హెడ్ ట్రాక్షన్ సిస్టమ్‌లకు కనెక్ట్ చేశారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో భాగమైన జాతీయ రహదారి-48పై మీటర్ పొడవు గల ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్ (PSC) వంతెన పూర్తయింది.

కాగా బుల్లెట్ రైలు ట్రయల్ సూరత్-బిలిమోరా మధ్య జరగనుంది. కారిడార్ విద్యుదీకరణ పనుల ప్రారంభం ద్వారా ఇది శుభసూచికగా కనిపిస్తుంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో విద్యుదీకరణ పనుల ప్రారంభం గురించి సమాచారాన్ని పంచుకుంది. గుజరాత్‌లో బుల్లెట్ రైలు ట్రయల్స్ 2026లో ప్రారంభం కానున్నాయి. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు బుల్లెట్ రైలు కారిడార్ మొత్తం పొడవు 508 కిలోమీటర్లు. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఎనిమిది గుజరాత్‌లో, నాలుగు మహారాష్ట్రలో ఉన్నాయి. గుజరాత్‌లో సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, సూరత్, బిలిమోరాలో స్టేషన్లు ఉన్నాయి. సూరత్ – బిలిమోరా మధ్య కారిడార్ పొడవు 50 కిలోమీటర్లు. ఈ భాగంలో పనులు అత్యంత అధునాతన దశలో ఉన్నాయి. బుల్లెట్ రైలు ట్రయల్ రన్ ఈ విభాగంలో జరగాలని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..