మంచుతో కట్టిన మాయాజాలం..! ఈ అద్భుత కేఫ్ లోపలి అందాలను తప్పక చూడాల్సిందే..ఎక్కడంటే..
ప్రపంచంలో చూడదగ్గ అనేక అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా మనం ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలకు సంబంధించిన విషయాలను ఇంట్లోనే కూర్చుని, హాయిగా అరచేతిలో చేసేస్తున్నాము. అలాంటి ఒక కేఫ్‌కి సంబంధించిన అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తిగా మంచుతో నిర్మించిన ఈ కేఫ్‌లో ఏర్పాట్లు సందర్శకులను మరింతగా ఆకర్షిస్తున్నాయి. దీన్ని చూసేందుకు నిత్యం అనేక మంది క్యూ కడుతున్నారు.

సోషల్ మీడియా రాకతో ప్రపంచ సరిహద్దులు కనుమరుగయ్యాయి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా అది క్షణాల్లో మనకు తెలిసింది. ఎలాంటి అద్భుత దృశ్యమైన, ఆశ్చర్యకరమైనది ఏదైనా సరే.. మన అరచేతిలో వాలిపోతుంది. అదేవిధంగా ఓ కేఫ్‌లోని అద్భుతమైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. కంటెంట్ క్రియేటర్ కన్వర్ పాల్ సింగ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. వీడియోలో లింగ్టి గ్రామానికి చెందిన అరుదైన కేఫ్ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
హిమాచల్ ప్రదేశ్ కాజా సమీపంలోని లింగ్టీ ఒక అందమైన గ్రామం. ఇక్కడే ఒక ప్రత్యేకమైన ఐస్ కేఫ్ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఆశ్రమంలా కనిపించే ఈ కేఫ్ అద్భుత సౌందర్యంతో ప్రతి ఒక్కరినీ నివ్వెరపరుస్తుంది. ఎందుకంటే ఇది ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా నిర్మించబడింది. ఈ గుహ లాంటి కేఫ్ లోపలి నుండి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ వేడి వేడి టీ, మ్యాగీని ఆస్వాదించవచ్చు.
మంచు ద్వారా ఇంత అందమైన స్థలాన్ని ఎలా నిర్మించగలం..? గుహ లాంటి కేఫ్‌ను గ్రామస్తులు ఎంతో నిశితంగా నిర్మించారని కన్వర్ చెప్పారు. లోపల రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అదేవిధంగా, ఒక చిన్న నీటి కొలను కూడా దాని గుండా ప్రవహించడం చూడవచ్చు. సమీపంలోని మంచులో ఏర్పాటు చేసిన సీటుపై ఒక వ్యక్తి కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఈ కేవ్ కేఫ్‌కి వచ్చిన వారికోసం టీ, మ్యాగీ వంటివి అందుబాటులో ఉన్నాయి. సాహస ప్రియులు, విభిన్నమైన అనుభూతిని కోరుకునే వారు ఈ కేఫ్‌ను ఎక్కువగా సందర్శిస్తుంటారు.
ఏది ఏమైనా ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ కేఫ్ చాలా మనోహరంగా ఉందని చాలా మంది వ్యాఖ్యనించారు. ఈ గుహ గోడలు కూలిపోతున్నాయని మరికొందరు రాశారు. అయితే, మంచులో అలాంటి కేఫ్ నిర్మించడం మాత్రం మామూలు ఫీట్ కాదు అంటున్నారు చాలా మంది నెటిజన్లు. మంచులో ఇటువంటి కేఫ్‌ను నిర్మించడం నిజంగా అభినందనీయం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..