AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheating: మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలతో ఇట్టే కనిపెట్టేయొచ్చు..

బంధం బలంగా ఉండాలంటే.. నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. తెగిపోయిన దారం ఎలాగైన మునుపటిలా ఉండదో.. బంధంలో కూడా ఒకసారి చీలకలు వస్తే మరోసారి మునుపటిలా..

Cheating: మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలతో ఇట్టే కనిపెట్టేయొచ్చు..
Relationships
Shiva Prajapati
|

Updated on: Nov 05, 2022 | 8:00 AM

Share

బంధం బలంగా ఉండాలంటే.. నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. తెగిపోయిన దారం ఎలాగైన మునుపటిలా ఉండదో.. బంధంలో కూడా ఒకసారి చీలకలు వస్తే మరోసారి మునుపటిలా ఉండదు. ముఖ్యంగా ఆలూమగల బాంధవ్యంలో ఆరోగ్యకరమైన సంబంధం ఉండాలంటే.. ఓపెన్ గా ఉండాలి. భాగస్వామితో మంచి సంభాషణలు కలిగి ఉండాలి. రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్ కాలిస్టో ఆడమ్స్ ప్రకారం.. మీరు మీ భాగస్వామితో అన్ని రకాల విషయాలను షేర్ చేసుకుంటే.. అది మీ ఇద్దరి మధ్య నమ్మకం, భావోద్వేగ బంధాన్ని పెంచుతుంది. అంతేకాదు.. ఈ సంభాషణ.. ఇద్దరి మధ్య విశ్వసనీయతను పెంచుతుంది. అయితే, మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నట్లయితే.. ఇలా ఓపెన్‌గా, మనస్ఫూర్తిగా ఉండలేరు. మోసం చేసే భాగస్వామి.. కొన్ని ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేరు. తడబటం, ఎదురు దబాయించడం చేస్తుంటారు. మోసం చేసే భాగస్వామి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నేను మీ ఫోన్ ఉపయోగించవచ్చా ?..

సర్టిఫైడ్ రిలేషన్షిప్ థెరపిస్ట్ రబీ స్లోమో స్లాట్కిన్ ప్రకారం.. మీ భాగస్వామి మీ నుండి ఏదైనా దాస్తున్నట్లు అనుమానం వచ్చినా? మోసం చేస్తున్నట్లు భావించినా.. అతని ఫోన్‌ను ఒకసారి అడిగి చూడండి. మీ ఫోన్ ఇస్తారా? అని అడగండి. అడిగిన వెంటనే ఇచ్చినట్లయితే ఎలాంటి సమస్యా లేదు. అలా కాకుండా వెయ్యి కుంటి సాకులు చెప్పడం మొదలుపెట్టినట్లయితే.. కాస్త అనుమానించాల్సిందే. ఫోన్ ఇవ్వకుండా సాకులు చెబుతూ, ఎదుటి వారి మాటలను పట్టించుకోకపోతే.. వారు రహస్యంగా ఏదో చేస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది.

ఇంతసేపు బయటకు ఎందుకు వెళ్లారు?

బయటకు ఇంతసేపు వెళ్లారెందుకు అని మీ భాగస్వామిని సూటిగా ప్రశ్నించాలి. ఆ ప్రశ్నకు ఒక్కసారిగా సమాధానం చెప్పకపోతే.. ఏదో కారణం ఉండే ఉంటుంది. ఈ సమయంలో సమాధానం చెప్పేటప్పుడు ప్రవర్తనలో తేడాను గమనించాలి.

భాగస్వామి వెకేషన్‌పై ఆసక్తి చూపడం..

మీ భాగస్వామి అకస్మాత్తుగా మీ వెకేషన్ గురించి కొంచెం ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లయితే కాస్త తేడాగా ఉన్నట్లే లెక్క. ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడు వస్తారు? ఎలా వెళతారు అని అడిగుతూ.. టైం పాస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటానని చెబుతూ ఉంటారు. అలాంటి సమయంలో నేరుగా అడిగేయాలి. నా వెకేషన్‌పై ఇంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారంటూ నేరుగా అడిగేయాలి. ఆ సమయంలో వారు డిఫెన్స్‌లో పడిపోయి, తడబడుతూ ప్రశ్నలకు సమాధానం చెపప్పకుండా తప్పించుకుంటున్నట్లయితే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లుగా భావించొచ్చు అని చెబుతున్నారు నిపుణులు.

నువ్వు నన్ను మోసం చేస్తున్నావా?

ఈ ప్రశ్నకు మీ భాగస్వామి కూల్‌గా సమాధానం ఇస్తే అంతా బాగానే ఉందని భావించొచ్చు. కానీ, భాగస్వామి భయపడుతున్నట్లు అనిపించినా? అకస్మాత్తుగా సాకులు చెప్పడం ప్రారంభించినా.. ఏదో తేడా ఉన్నట్లే.

హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..