డీర్ పార్క్‌లో అరుదైన ఘటన.. బతకడమే కష్టం అంటే ఏకంగా 5 గుడ్లు పెట్టిన తాబేలు!
అత్యంత అరుదుగా నక్షత్రపు తాబేళ్లు కనబడుతాయి. సహజంగా సముద్రం ప్రాంతంలో ఈ తాబేళ్ళు సంచరిస్తాయి. అయితే.. కరీంనగర్‌లోని డీర్ పార్క్‌లోని ఈ తాబేలు ఇప్పుడు గుడ్లు పెట్టింది. మరో 5 నక్షత్ర తాబేళ్ళకు జన్మనివ్వబోతోంది. దీంతో వాటిని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

అత్యంత అరుదుగా నక్షత్రపు తాబేళ్లు కనబడుతాయి. సహజంగా సముద్రం ప్రాంతంలో ఈ తాబేళ్ళు సంచరిస్తాయి. అయితే.. కరీంనగర్‌లోని డీర్ పార్క్‌లోని ఈ తాబేలు ఇప్పుడు గుడ్లు పెట్టింది. మరో 5 నక్షత్ర తాబేళ్ళకు జన్మనివ్వబోతోంది. దీంతో వాటిని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
కరీంనగర్ డీర్ పార్క్‌లో ఇప్పుడు ఓ తాబేలును చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అరుదుగా కనబడే.. ఈ తాబేలు.. మరో 5 పిల్లలకు జన్మనివ్వనుంది. ఇవి వాతావరణం అనుకూలంగా ఉంటే తప్పా.. గుడ్లు పెట్టని నక్షత్రపు తాబేలు ఏకంగా ఐదు గుడ్లు పెట్టింది. త్వరలో రాబోయే బుల్లి స్టార్ టార్టాయిస్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.
ఇక్కడీ డీర్ పార్కులో అరుదైన నక్షత్రపు తాబేళ్లను పెంచుతున్నారు అధికారులు. అందులో పెద్ద స్టార్ టార్టాయిస్ ఏకంగా ఐదు గుడ్లు పెట్టింది. నక్షత్రపు తాబేళ్లు మైదాన ప్రాంతంలో ఏ మాత్రం కనిపించవు. వాతావరణం సరిగా లేకపోతే గుడ్లను కుడా పెట్టావు. సహజంగానే కరీంనగర్ జిల్లాలో ఎండ ఎక్కువగా ఉంటుంది. ఎండను తట్టుకొని 5 గుడ్లు పెట్టింది. ఈ ప్రాంతంలో తాబేళ్ళు కనబడటమే చాలా అరుదు. అందులో.. ఇలాంటి తాబేళ్ళు కనబడటంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తాబేలును సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు. చిన్న పిల్లలు ఈ తాబేలును చూసి మురిసిపోతున్నారు.
తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సముద్ర తీరంలోని ఇసుక ప్రాంతాలను ప్రత్యేకంగా ఎంచుకుంటాయి. గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీరాల్లో గుడ్లు పెట్టే తాబేళ్ల కోసం అక్కడి అధికారులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటారు. గుడ్లను రక్షించి.. అవి తాబేళ్లుగా మారి.. తిరిగి సముద్రంలోకి వెళ్లే వరకు వాటిని కాపాడుతుంటారు. అయితే కరీంనగర్‌లోని నక్షత్రపు ఆకారపు తాబేళ్లు అలా కాదు. నక్షత్రపు తాబేళ్లు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు గుడ్లు పెట్టవు. వాటికి వాతావరణం నచ్చితేనే గుడ్లు పెడుతాయని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. భూమి మీద ఉండే తాబేళ్లు వాటి మనుగడ ప్రమాదంలో ఉందని భావిస్తే.. సంతానోత్పత్తికి ఆసక్తి చూపవు. అవి సురక్షితంగా ఉన్నాయని అనుకున్నప్పుడు మాత్రమే గుడ్లు పెడతాయని అధికారులు చెబుతున్నారు.
కరీంనగర్ డీర్ పార్క్‌లో ప్రస్తుతం మూడు తాబేళ్ళు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఎండల దృష్ట్యా వీటిని ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. ఇవి ఉండే ప్రాంతాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచుతున్నారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




