AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి అవకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (April 26, 2025): మేష రాశి వారికి ఆదాయానికి లోటుండకపోవచ్చు. అయితే, మితిమీరిన ఖర్చులుండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి రోజంతా సుఖ శాంతులతో సాగిపోతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి అవకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 26 April 2025
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 26, 2025 | 5:01 AM

Share

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2025): మేష రాశి వారికి ఆదాయానికి లోటుండకపోయినా.. మితిమీరిన ఖర్చులుండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి రోజంతా సుఖ శాంతులతో సాగే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి కూడా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. అయితే, వ్యయ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నందువల్ల మితిమీరిన ఖర్చులుండే అవకాశం ఉంది. చతుర్థ స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. గృహన, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత బాగా పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడు పరమోచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల రోజంతా సుఖ శాంతులతో సాగిపోతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబ వ్యవ హారాల్లో ఇతరుల జోక్యం వల్ల ఇబ్బంది పడతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశ్యధిపతి బుధుడు దశమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ప్రముఖులతో స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. సామాజికంగా హోదా, స్థితిగతులు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశికి భాగ్య, లాభాధిపతులైన గురు, శుక్రుల మధ్య పరివర్తన కొనసాగుతున్నందువల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమ స్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రాశ్యధిపతి రవి భాగ్య స్థానంలో ఉచ్ఛలో ఉన్నందువల్ల ఒకటి రెండు ధన యోగాలు రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి కొత్త ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా లభిస్తాయి. తండ్రి నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగి పోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రాశ్యధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం, భాగ్య స్థానంలో గురువు సంచారం చేస్తుండడం వల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. జీత భత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడు ఆరవ స్థానంలో ఉచ్ఛలో కొనసాగుతున్నందు వల్ల ఆదాయం బాగా వృద్ధి చెంది, కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు అంది వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో ఉండడంతో పాటు, సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

చతుర్థ స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో కొనసాగుతున్నందువల్ల ఇంటా బయటా సుఖ సంతోషాలకు లోటుండకపోవచ్చు. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. రాశ్యధిపతి గురువు షష్ట స్థానంలో ఉన్నందువల్ల ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అయితే, ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపో తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రాశ్యధిపతి శని ద్వితీయ స్థానంలో ఉచ్ఛ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అధికారులకు మీ వల్ల లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి గురువుతో శుక్రుడికి పరివర్తన కొనసాగుతున్నందువల్ల ఆదాయపరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందు తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ప్రేమ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

Follow Us