Police Celebrations: డీజే టిల్లు పాటకు దుమ్మురేపిన ఎస్పీ.. ఖాకీల డబుల్ డోస్ హంగామా.. మామూలుగా లేదుగా..!

ఎప్పుడు కంటి మీద కునుకు లేకుండా గడిపే పోలీసులు ఆటాపాటలతో అదరగొట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు సంబరాల్లో మునిగిపోయారు. జిల్లా ఎస్పీ కిరణ్ కారే తోసహా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది అంతా కలిసి డ్యాన్సులు వేశారు. ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేస్తూ, సక్సెస్ మీట్ జరుపుకున్నారు.

Police Celebrations: డీజే టిల్లు పాటకు దుమ్మురేపిన ఎస్పీ.. ఖాకీల డబుల్ డోస్ హంగామా.. మామూలుగా లేదుగా..!
Jayashankar Bhupalapally Police
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 26, 2024 | 7:53 AM

ఎప్పుడు కంటి మీద కునుకు లేకుండా గడిపే పోలీసులు ఆటాపాటలతో అదరగొట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు సంబరాల్లో మునిగిపోయారు. జిల్లా ఎస్పీ కిరణ్ కారే తోసహా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది అంతా కలిసి డ్యాన్సులు వేశారు. ఫుల్ జోష్‌తో ఎంజాయ్ చేస్తూ, సక్సెస్ మీట్ జరుపుకున్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. దీన్ని పురస్కరించుకుని సక్సెస్ మీట్ జరుపుకున్నారు జిల్లా పోలీసులు. ఎన్నికలు ముగియడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు గెస్ట్ హౌస్ లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసు అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ కారే తో సహా పోలీస్ అధికారులు సిబ్బంది అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గానభజానలో మునిగి తేలారు. డీజే పాటలకు పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి భూపాలపల్లి ఎస్పీ స్టెప్పులు వేశారు.

జిల్లా ఎస్పీ కిరణ్ కారే డీజే టిల్లు పాటలకు సిబ్బందితో కలిసి స్టెప్పులు వేశారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలు జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ప్రశాంతంగా ముగియడంతో జిల్లాలోని డీఎస్పీలు,సిఐలు, ఎస్ఐలతో కలిసి డీజే పాటలకు ఎస్పీ సంబరాలు జరుపుకున్నారు. ఈ జిల్లాకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రతో మావోయిస్టు ప్రాంతాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. ఒక్క సంఘటన కూడా జరగకుండా పోలింగ్ ముగియడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు జిల్లా పోలీసులు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. వారితో సరదా గడుపుతూ ఆటపాటల్లో మునిగి తేలారు జిల్లా ఎస్సీ కిరణ్ కారే.

ఈ వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..