Pet Dog: ఉరికి వేలాడుతున్న యజమానిని దించేందుకు 4 గంటలు పోరాడిన కుక్క.. కానీ పాపం
తనను ప్రేమగా సాకిన పట్ల తన ప్రేమను చాటుకుంది ఓ శునకం. ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న యజమానిని కిందకు దింపేందుకు దాదాపు 4 గంటలపాటు శ్రమించింది. ఆ తర్వాత అది కూడా కన్నుమూసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

కుక్కలు విశ్వాసానికి మారుపేరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంచెం ఆప్యాయంగా చూసుకుంటే చాలు.. అవి యజమాని కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనకాడవు. ఈ మధ్య పెట్ డాగ్స్‌ని పెంచుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. అయినవాళ్లే మోసం చేసే ఈ రోజుల్లో.. అవే బెస్ట్ అని చాలామంది నమ్ముతున్నారు. తాజాగా ఓ శునకం తన యజమానిని బతికించుకునేందుకు విలవిల్లాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో అదివారం రాత్రి వెలుగుచూసింది. ఉరి వేసుకున్న యజమానిని కిందకు దింపేందుకు అది 4 గంటల పాటు విశ్వప్రయత్నం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీలోని పంచవటి కాలనీలో 23 ఏళ్ల సంభవ్ అగ్నిహోత్రి నివసిస్తున్నాడు. అతడు సివిల్స్ ఎగ్జామ్ రాసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. సంభవ్ తండ్రి ఆనంద్ అగ్నిహోత్రి రైల్వేలో ఉద్యోగి. అతడి తల్లి అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంది. ట్రీట్మెంట్ కోసం ఆమెను భోపాల్ తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. దీంతో ఇంట్లో సంభవ్‌తో పాటు పెట్ డాగ్ అలెక్స్ ఉంది. కాగా ఆదివారం తండ్రి ఆనంద్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. సంభవ్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పక్కింటివారికి ఫోన్ చేసి.. తనయుడి గురించి ఎంక్వైరీ చేశారు. ఇరుగుపొరుగువారు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అలెక్స్ వారిపై దాడి చేసింది.
సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. వారిని సైతం కుక్క లోపలికి రానివ్వలేదు. దీంతో చేసేదేం లేక లెక్స్‌కు మత్తుమందు ఇచ్చి బంధించారు. అనంతరం సంభవ్ డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అలెక్స్ కూడా కాసేపటికి మృతి చెందింది. మత్తు ఓవర్ డోస్ అవ్వడం వల్లే అలెక్స్ చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




