AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day: నాడు ప్రేమ కోసం కోట్లాడితే.. నేడు ప్రజల కోసం.. కార్పొరేషన్‌లో కాదల్‌ కపుల్స్‌..!

అప్పుడు ప్రేమలో గెలిచారు.. ఇప్పుడు రాజకీయంలో రాణిస్తున్నారు.. నాడు ప్రేమను గెలిపించు కోవడం కోసం కోట్లాడితే.. ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రజాప్రతినిధిగా గెలుస్తున్నారు. ఈ లవ్ లీడర్స్. ప్రేమికుల దినోత్సం సందర్భంగా కరీంనగర్‌ కార్పొరేషన్‌లో లవ్‌ స్టోరీస్‌పై ప్రత్యేక కథనం..

Valentine's Day: నాడు ప్రేమ కోసం కోట్లాడితే.. నేడు ప్రజల కోసం.. కార్పొరేషన్‌లో కాదల్‌ కపుల్స్‌..!
Valentine's Day
G Sampath Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 13, 2025 | 6:55 PM

Share

అప్పుడు ప్రేమలో గెలిచారు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. గొడవులు.. కేసులు.. పెద్దల అభ్యంతరాలు.. ఇవన్నీ తట్టుకుని.. ప్రేమ కోసం నిలబడ్డారు. కొన్ని రోజుల తరువాత.. ఆ పెద్దలే దీవించారు. అయితే, ఇలా ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలు.. ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రజాప్రతినిధిగా గెలుస్తున్నారు. ఈ లవ్ లీడర్స్.. ప్రేమికుల దినోత్సం సందర్భంగా.. ప్రజాప్రతినిధుల ప్రేమ పెళ్ళిలపై స్పెషల్ స్టోరీ..!

కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలే అధికంగా ఉన్నాయి. ఇటీవలే పదవీ కాలం ముగిసింది. కార్పొటర్లు తాజా మాజీలయ్యారు. కానీ వాళ్లలో కొందరి లవ్‌ స్టోరీస్‌ ఓవైపు కార్పొరేషన్‌ హిస్టరీలో రికార్డుగా నిలిస్తే, మరోవైపు ప్రేమికులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. సహజంగా ఇలాంటి జంటలు ఒక్కటి.. రెండు ఉంటాయి.. ఈ మునిసిపిల్ కార్పొరేషన్‌లో మాత్రం.. 8కు పైగా జంటలు ప్రజాప్రతినిధులుగా ఉన్నాయి. వీరందరూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే. తరువాత రాజకీయంలో సక్సెస్ అయ్యారు. ఇటు భర్తతో పాటు భార్య కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మరో ముఖ్య విషయం.. జనరల్ సీటులో కూడా ఈ ప్రేమ జంటలను భార్యను నిలబెట్టారు. దీంతో జనరల్ స్థానాల్లో రిజర్వేషన్ అభ్యర్థులు విజయం సాధించారు.

అయితే.. అప్పుడు ప్రేమ కోసం ఎలాంటి యుద్ధం చేశారో.. ఇప్పుడు గెలుపు కోసం అలాంటి యుద్ధం చేసి సక్సెస్ అవుతున్నారు. అంతేకాకుండా.. వరుసగా విజయాలు కూడా సాధించారు. ఒక్కసారి ఓడినా.. తరువాత.. మళ్లీవి జయం సాధిస్తున్నారు. గతంలో ప్రేమ పెళ్లిలతో ఆదర్శంగా ఉంటే.. ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఆదర్శంగా ఉంటున్నారు. వీరంతా.. రెండు దశబ్దాల క్రితమే.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక్కసారి.. వారి ప్రేమ పెళ్లిలు ఎలా జరిగాయి. వారు.. రాజకీయ జీవి తంలో ఎలా గెలిచారు అనే విషయం తెలుసుకుందాం..!

మంకమ్మ తోట కార్పొరేటర్‌ గుగ్గిల్ల జయశ్రీ సమకాలీన రాజకీయాల్లో తన మార్క్‌ చాటుకుంటున్నారు. భర్త శ్రీనివాస్‌ కూడా రాజకీయాల్లో ఉన్నారు. అప్పట్లో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు కారణం.. చెక్కు చెదరని ప్రేమానుబంధాలే అంటారు ఈ జంట. ఒక్కే ప్రాంతంలో నివసించే జయశ్రీ-శ్రీనివాస్ వేరు. వేరు కాలేజీల్లో చదువుకున్నారు. ఒక్కే ప్రాంతం కావడంతో.. పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ పెళ్లిలు పెద్దలు అడ్డు చెప్పారు. అయితే.. దైర్యంతో ముందు అడుగు వేసి 1996లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల తరువాత.. పెద్దలు దీవించారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తరువాత.. రాజకీయంలో అడుగుపెట్టారు. గుగ్గిల్ల జయశ్రీ.. జనరల్ రిజర్వేషన్‌లో కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత.. మరోసారి రెండవసారి కూడా విజయం సాధించారు. ఈ జంట రాజకీయంలో రాణిస్తూ.. ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు.

కరీంనగర్‌ కార్పొరేషన్ల మరో ప్రేమ జంట. చొప్పరి వేణు – జయశ్రీ. రాంచంద్రపూర్ కాలనీకి చెందిన చొప్పరి వేణు.. జ్యోతినగర్ కి చెందిన జయశ్రీ స్థానిక SRR డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు. ఇద్దరూ ఇష్టపడ్డారు. కానీ ప్రేమ పెళ్లికి పెద్దల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. చివరికి 1995లో లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. కొన్ని రోజుల తరువాత.. రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జయశ్రీ రెండు సార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ప్రస్తుతం ఈ జంట ఆదర్శంగా నిలుస్తున్నారు.

కరీంనగర్ శర్మ నగర్ తాజా మాజీ కార్పొరేటర్‌ శ్రీలత చంద్రశేఖర్‌దీ ప్రేమపెళ్లినే. 1998లో ఓ ఆలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదుయ్యాయి. ఇప్పటికీ శ్రీలత కుటుంబం.. చంద్రశేఖర్‌కు దూరంగా ఉంటున్నారు. చంద్రశేఖర్.. ఒక్కసారి కౌన్సిలర్‌గా సేవలందించారు. శ్రీలత రెండు సార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ప్రేమను మాత్రమే సేవతో ప్రజల హృదయాలను గెలుస్తున్నారు ఈ జంట..

కరీంనగర్ ఆదర్శనగర్ డివిజన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆర్ష కిరణ్మయి-మల్లేషం జంట ఈ తరం ప్రేమకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన జంట. వీళ్లు 1981లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మల్లేశం ఒక్కసారి కౌన్సిలర్‌గా , ఒకసారి కార్పొరేటర్‌గా సేవలందించారు. కిరణ్మాయి కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా రాణించారు. మంచిని పంచాలి.. ప్రేమను పెంచాలి.. ప్రేమిస్తే కష్టాసుఖాల్లో కలిసి నడవాలి. అదే నిజమైన ప్రేమ అంటారు కిరణ్మయి-మల్లేషం.

జీవితమంటేనే కబీ ఖుష్‌.. కబీ గమ్‌.. కానీ అర్ధం చేసుకునే వాళ్లు తోడుగా వుంటే మాత్రం లైఫ్‌ ఈజ్‌ సో బ్యూటీఫుల్‌.. అందుకు నిదర్శనమే ఈ లవ్‌ కపుల్స్‌. ఎందరో ప్రేమిస్తుంటారు. కానీ కొందరే ఇలా ప్రేమతో ప్రేమను.. జీవితాలను గెలుస్తారు. trust and true love is forever.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..