NTPC Jobs 2021: ఎన్‌టీపీసీ నుంచి 230 జాబ్స్ నోటిఫికేషన్.. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ.. అర్హులెవరంటే..
NTPC Jobs 2021: ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) 230 ఉద్యోగాల
NTPC Jobs 2021: ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC Limited) 230 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్ విభాగంలో ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 10 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.ntpc.co.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్(AE) – 200 (ఎలక్రికల్-90, మెకానికల్-70, ఎలక్ర్టానిక్స్/ఇన్స్‌స్ట్రుమెంటేషన్-40) అసిస్టెంట్ కెమిస్ట్ – 30. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్/మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ఇన్ట్స్రుమెంటేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. అసిస్టెంట్ కెమిస్ట్ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి.. ఏడాది అనుభవం ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. చివరితేది మార్చి 10, 2021గా నిర్ణయించారు.ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.