Gas Cylinder Leak: ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు లైట్స్, ఫ్యాన్స్ ఆఫ్ చేస్తున్నారా? ఇది మరింత ప్రమాదమని మీకు తెలుసా?
ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయిందని అనుమానం వచ్చినప్పుడు సాధారణంగా ప్యాన్లు, లైట్లు, ఫ్రిజ్ లాంటివి స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాము. కానీ అలా చేయటం కూడా చాలా డేంజర్ అంటున్నారు క్లూస్ టీం ఎక్స్పర్ట్స్. ఇంట్లో జరిగే అగ్ని ప్రమాదాలు ప్రధానంగా రెండు కారణాల వల్ల జరుగుతాయి.

ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయిందని అనుమానం వచ్చినప్పుడు సాధారణంగా ప్యాన్లు, లైట్లు, ఫ్రిజ్ లాంటివి స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాము. కానీ అలా చేయటం కూడా చాలా డేంజర్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంట్లో జరిగే అగ్ని ప్రమాదాలు ప్రధానంగా రెండు కారణాల వల్ల జరుగుతాయి. ఒకటి ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్.. రెండు సిలిండర్ లీక్. సిలిండర్ లీక్ అయినప్పుడు రెండు సందర్భాలు ఏర్పడతాయి ఒకటి స్టవ్ ఆన్‌లో ఉన్నప్పుడు.. సిలిండర్ లీక్ అయితే లీకైన ఏరియా దగ్గర నుంచి మంటలు వస్తాయి. దానిని సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే కంట్రోల్ చేయొచ్చు. కానీ గ్యాస్ లీక్ అయిన విషయం గమనించకుండా వెలిగిస్తే సెకండ్ల వ్యవధిలో సిలెండర్ బ్లాస్ట్ అవుతుంది. గ్యాస్ లీక్ అయినప్పుడు ఫ్యాన్, లైట్ స్విచ్ ఆన్ చేసినా.. ఆఫ్ చేసినా చాలా డేంజర్. లీక్ అయిన గ్యాస్ గాలిలోని ఆక్సిజన్‌తో 1:4 నిష్పత్తిలో కలిసినప్పుడు అది ఎక్స్ప్లోషన్ గా మారుతుంది.
ఆ సమయంలో ఏ చిన్న లైట్ స్పార్క్ లాంటిది ఏర్పడినా సిలిండర్ వెంటనే బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి గ్యాస్ లీక్ అయిందని గమనించినప్పుడు ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ ఐటమ్స్, స్విచ్ బోర్డులు ఆన్‌లో ఉన్న వాటిని ఆన్ లోనే.. ఆఫ్ లో ఉన్న వాటిని ఆఫ్ లోనే ఉంచాలి. స్విచ్ బోర్డ్ నుంచి వచ్చే మనకు కనపడని ఎలక్ట్రికల్స్ స్పార్క్ వల్ల సిలెండర్ పేలే అవకాశాలుంటాయి. వంటింట్లో రిఫ్రిజిరేటర్ పెట్టకూడదంటారు ఎందుకంటే రిఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆన్ ఆఫ్ లైట్ స్విచ్ నుంచి కూడా మనం గుర్తించలేని స్పార్క్ ని కుడా లీకైన గ్యాస్ క్యాచ్ చేసే అవకాశం ఉంది.
గ్యాస్ లీక్ అయిందని గమనించినప్పుడు ఏం చేయాలి..
స్టవ్ వెలిగించక ముందే గ్యాస్ లీక్ అయినట్టు గమనిస్తే సిలిండర్ ని వీలైనంత తొందరగా ఇంటి నుంచి బయటకు తీసుకొని రావాలి. అవకాశం ఉంటే రూమ్ లో సిలిండర్ పెట్టే దగ్గర కింది భాగంలో కిటికీ లాంటి వెంటిలేషన్ ఏర్పాటు ఉండాలి. ఎందుకంటే సాధారణంగా గ్యాస్ గాలి కంటే బరువుగా ఉంటుంది కాబట్టి లీక్ ఇన గ్యాస్ నేలకు ఒక మీటర్ ఎత్తువరకు స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో గ్యాస్ కిటికీ గుండా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండే విసనకర్రలు లాంటి వాటితో ఊపుతూ గ్యాస్ ని కిటికీలు తలుపుల గుండా బయటకు పంపించినా కూడా తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.




మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
