AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ceilings Fans: మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్.. అమెజాన్‌ సేల్‌లో ప్రత్యేక తగ్గింపులు

బీఎల్‌డీసీ మోటర్ ఫ్యాన్లు ఇటీవల ప్రజలను అధికంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సైట్ అయిన అమెజాన్ సీలింగ్ అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించారు. సీలింగ్ ఫ్యాన్‌లపై 54 శాతం వరకు తగ్గింపును ప్రకటించాయి. శక్తి సమర్థవంతమైన మోడల్‌లు, స్టైలిష్ డిజైన్‌లు లేదా రిమోట్ కంట్రోల్ ఆపరేషన్, యాంటీ-డస్ట్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్‌లతో వచ్చే ఫ్యాన్లు అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

Ceilings Fans: మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్.. అమెజాన్‌ సేల్‌లో ప్రత్యేక తగ్గింపులు
Celing Fans
Nikhil
| Edited By: Rajeev Rayala|

Updated on: Mar 28, 2024 | 7:15 PM

Share

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏదైనా పని మీద బయటకు వెళ్లి ఇంటికి రాగానే ఫ్యాన్ వేసుకుని ఆ గాలిలో సేద తీరుతూ ఉంటారు. మారుతున్న టెక్నాలజీ ప్రకారం సీలింగ్ ఫ్యాన్స్ టెక్నాలజీలో బోలెడన్ని మార్పులు వచ్చాయి. బీఎల్‌డీసీ మోటర్ ఫ్యాన్లు ఇటీవల ప్రజలను అధికంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సైట్ అయిన అమెజాన్ సీలింగ్ అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించారు. సీలింగ్ ఫ్యాన్‌లపై 54 శాతం వరకు తగ్గింపును ప్రకటించాయి. శక్తి సమర్థవంతమైన మోడల్‌లు, స్టైలిష్ డిజైన్‌లు లేదా రిమోట్ కంట్రోల్ ఆపరేషన్, యాంటీ-డస్ట్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్‌లతో వచ్చే ఫ్యాన్లు అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఫ్యాన్లపై ఓ లుక్కేద్దాం. 

అటామ్‌బెర్గ్ రెనెసా 1200 ఎంఎం

అటామ్‌బెర్గ్ రెనెసా 1200 ఎంఎం సీలింగ్ ఫ్యాన్ సొగసైన డిజైన్‌తో శక్తి సామర్థ్యాన్ని మిళితం చేసే ఒక ఆధునిక ఫీచర్‌తో వస్తుంది. ఈ ఫ్యాన్ బీఎల్‌డీసీ మోటార్ గరిష్టంగా 65 శాతం వరకూ శక్తిని ఆదా చేస్తుంది. స్పీడ్ 5 వద్ద 28 వాట్స్ మాత్రమే విద్యుత్‌ను వినియోగిస్తుంది. రిమోట్ కంట్రోల్ బూస్ట్ మోడ్, స్లీప్ మోడ్ వంటి ఫీచర్లతో సౌలభ్యాన్ని జోడిస్తుంది. ఎల్ఈడీ లైట్లు, పౌడర్-కోటెడ్ మాట్ ఫినిషింగ్‌తో దాని ప్రత్యేక డిజైన్ ఆకట్టుకుంటుంది. తక్కువ వోల్టేజ్ వద్ద కూడా స్థిరమైన వేగాన్ని నిర్వహిస్తుంది. అంతరాయం లేని సౌకర్యాన్ని అందిస్తుంది. 2+1 సంవత్సరాల వారంటీ, సులభమైన ఇన్‌స్టాలేషన్ ఆప్షన్‌లతో స్టైల్, పొదుపులను కోరుకునే వారికి ఈ ఫ్యాన్ స్మార్ట్ ఎంపిక. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫ్యాన్ రూ.3799కు అందుబాటులో ఉంది. 

ఓరియంట్ ఎలక్ట్రిక్ అపెక్స్ ఎఫ్ఎక్స్   

ఓరియంట్ ఎలక్ట్రిక్ అపెక్స్-ఎఫ్ఎక్స్ సీలింగ్ ఫ్యాన్ అనేది బలమైన ఎయిర్ డెలివరీని కోరుకునే వారికి నమ్మదగిన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా ఉంది. 350 ఆర్‌పీఎం వద్ద ఫ్యాన్ వేగం, 210 సీఎంఎం గాలి ప్రవాహంతో చల్లని, సౌకర్యవంతమైన వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. యాంటీ రస్ట్ గాల్వనైజ్డ్ బ్లేడ్‌లు సులభమైన నిర్వహణ సామర్థ్యాన్ని అందిస్తాయి. డబుల్ బాల్ బేరింగ్ టెక్నాలజీతో వచ్చే ఈ ఫ్యాన్‌ను ప్రస్తుతం రూ.1499కు సొంతం చేసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

బజాజ్ ఫ్రోర్ 1200 మిమీ 

బజాజ్ ఫ్రోర్ 1200 ఎంఎం సీలింగ్ ఫ్యాన్ సమర్థవంతమైన శీతలీకరణను కోరుకునే వారికి బడ్జెట్ అనుకూలమైన ఎంపికగా ఉంటుంది. 390 ఆర్‌పీఎంతో వచ్చే అధిక వేగం, 52 వాట్ల విద్యుత్ వినియోగంతో వస్తుంది. సూపర్ ఎయిర్ డెలివరీని అందించే ఈ ఫ్యాన్ మెరుగైన రస్ట్ ప్రూఫ్ కోటింగ్‌ను కలిగి ఉంది. 2 సంవత్సరాల ఉత్పత్తి వారంటీతో వచ్చే ఈ ఫ్యాన్ రూ.1399కు అందుబాటులో ఉంది. 

అటామ్‌బెర్గ్ ఎఫ్ఫికో ఆల్ఫా 1200 ఎంఎం 

అటామ్‌బెర్గ్ ఎఫ్ఫికో ఆల్ఫా 1200 ఎంఎం సీలింగ్ ఫ్యాన్ అనేది ఎనర్జీ కాన్షియస్ వినియోగదారులకు ఒక క్లాసిక్ ఎంపికగా ఉంటుంది. దీన్ని బీఎల్‌డీసీ మోటార్ గరిష్ట వేగంతో 28 వాట్స్ వద్ద మాత్రమే వినియోగించే 65 శాతం వరకు శక్తి పొదుపును నిర్ధారిస్తుంది. ఈ ఫ్యాన్ 365 ఆర్‌పీఎం వద్ద 230 సీఎంఎంకు సంబంధించి అత్యుత్తమ ఎయిర్ డెలివరీని అందిస్తుంది. రిమోట్ కంట్రోల్ బూస్ట్ మోడ్, స్లీప్ మోడ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటుంది. 1+1-సంవత్సరాల వారంటీతో మంచి ఇన్‌స్టాలేషన్ ఎంపికలతో వచ్చే ఈ ఫ్యాన్ రూ.2799కు కొనుగోలు చేయవచ్చు. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..