10 December 2025

క్రిస్టమస్‌‌కు గోవా వెళ్తున్నారా...అయితే అక్కడ తప్పక చూడాల్సిన అందమైన చర్చిలు ఇవే!

samatha

Pic credit - Instagram

క్రిస్మస్ సెలవుల్లో చాలా మంది ఎక్కువగా గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అయితే గోవా వెళ్లాలి అనుకునే వారు తప్పకుండా కొన్ని ప్రదేశాలు సందర్శించాలంట.

క్రిస్మస్‌కు గోవా వెళ్లాలి అనుకునే వారు గోవాలో ఉన్న బీచ్‌లే కాకుండా అద్భుతమైన చర్చిలు కూడా ఉన్నాయంట. కాగా గోవాలో చూడాల్సిన చర్చిలు ఏవో ఇప్పుడు చూద్దాం.

బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ . ఇది రాష్ట్రంలోనే ప్రసిద్ధ వాస్తు శిల్పానికి, మతపరమైన ప్రదేశానికి ప్రతీక. ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

తెలుపు రంగులో ఉండే సెయింట్ మైఖేల్ చర్చి, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రశాతమైన వాతావరణంలో ఉండే ఈ చర్చి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

మే డి డ్యూస్ చర్చిని మాండ్రే డి డ్యూస్ చర్చి అని కూడా పిలుస్తారు. ఇది అద్భుతమైన బంగారు పూతతో , నియోగోతిక్ శైలిలో చాలా బాగుంటుంది. రాత్రి పూట దీని అందాలు వర్ణించ చాలదు.

వాటికన్ నగరంలో ఉండే సెయింట్ పీటర్స్ బసిలికాను పోలిన సెయింట్ కాజేటన్ చర్చి దక్షిణ గోవాలో అత్యంత అందమైన చర్చిలలో ఒకటి. ఇది కొరింథియన్ ఆర్కిటెక్చర్ బరోక్ శైలిలో ఉంటుంది.

చర్చి ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది మౌంట్ పై ఉన్న అత్యంత ప్రసిద్ధ పాత గోవా చర్చి. సే కేథడ్రల్ పక్కనే ఉండే ఈ చర్చి చుట్టుపక్కల కొండలతో చాలా అద్భుతంగా ఉంటుంది.

అద్భుతమైన నిర్మాణ శైలితో ఉండే  సే కేథడ్రల్ గోవాలో ఉన్న అతి పెద్ద చర్చి. భారతదేశంపై పోర్చు గీస్ పాలన విజయానికి గుర్తుగా దీనిని సెయింట్ కేథరీన్‌క అంకితం చేశారు