హాట్సాప్.. మితిమీరిన ప్లాస్టిక్ ను వాడుకలోకి తెచ్చి ఔరా అనిపిస్తున్న యువకుడు..!
ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నీ కార్యక్రమాలు చేపట్టిన అరికట్టడం కష్టంగా మారింది. తనలోని ఆలోచనతో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని వినూత్న ప్రయోగం చేశాడు ఓ వ్యక్తి. మితిమీరిన ప్లాస్టిక్ ను కూడా వాడుకలోకి తెచ్చి ఔరా అనిపిస్తున్నాడు. అతనేంటి అతని ప్రయోగాలేంటీ ఇప్పుడు తెలుసుకుందాం..

ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నీ కార్యక్రమాలు చేపట్టిన అరికట్టడం కష్టంగా మారింది. తనలోని ఆలోచనతో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని వినూత్న ప్రయోగం చేశాడు ఓ వ్యక్తి. మితిమీరిన ప్లాస్టిక్ ను కూడా వాడుకలోకి తెచ్చి ఔరా అనిపిస్తున్నాడు. అతనేంటి అతని ప్రయోగాలేంటీ ఇప్పుడు తెలుసుకుందాం..
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని బసు డీపో ప్రాంతంలో ఉంటాడు ప్రభాకర్. ఎప్పుడు ఏదో కొత్త ప్రయోగాలు చేసె ఈ ప్రభాకర్ ను అందరు ప్రయోగాల ప్రభాకర్ అంటారు. ఇతను గత నలుభై సంవత్సరాల నుండి సోలార్ తో విద్యుత్ తయారీ, పంటపొలాలకు ఫినిషింగ్, అటోమేటిక్ జనరేటర్, మల్టిపర్పస్ బెడ్, కొకొనాట్ సైక్లింగ్ మిషన్, పసుపు బ్రాయిలర్, సోలార్ వాహనం ఇలా ఎన్నో ప్రయోగాలు చేశాడు. దీనికిగాను రాష్ట్రస్థాయి ఇంటింటా ఇన్నోవేషన్ అవార్డు రైతు నేస్తం అవార్డు, NIRD అవార్డు, ఇంకోవాస్ అవార్డులు అందుకున్నాడు. ప్రభాకర్ కు పెంటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి.
అయితే ఎప్పుడూ ఒకేలాగా ఆలోచించడం తన నైజం కాదని సమాజానికి ఏదో చేయాలన్న ఉద్దేశంతో వ్యర్ధాలతో ప్లాస్టిక్ రీసైకిలింగ్ చేసి వాటి ద్వారా పైపులు తయారుచేసి ఆ పైపులను ఇంకుడు గుంతలకు వ్యవసాయ రంగానికి మురికి కాలువలకు, మున్సిపాలిటీ పనులకు విక్రయిస్తున్నాడు. వర్షం నీరు వృధాగా పోవడం వల్ల భూగర్భ జలాలు అంతరించిపోతాయన్న ఉద్దేశంతో హాస్పిటల్లో పడేసిన ప్లాస్టిక్, అలాగే ప్లాస్టిక్ డబ్బాలు ఇతర పనికిరాని ప్లాస్టిక్లు తీసుకువచ్చి పైపుల్లా తయారు చేస్తున్నాడు.
తయారు చేసిన పైపులకు రంధ్రాలు చేసి వాటిని ఇంకుడు గుంతల వద్ద రైతులు వ్యవసాయ మోటార్ వద్ద అమర్చడం వల్ల వృధాగా పోతున్న నీరు ఆ పైపు ద్వారా భూమిలోకి వెళ్లడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని అంటున్నాడు. పైపులు తయారీకి పెద్దగా ఖర్చు ఉండదని తక్కువ ఖర్చుతో ప్లాస్టిక్ మరో కొత్త రూపంగా మార్చి, అది సమాజానికి ఉపయోగపడే విధంగా చేయవచ్చని చెబుతున్నాడు.
గత సంవత్సర కాలం నుండి ప్లాస్టిక్ వ్యర్ధాలతో పైపులు తయారు చేసి విక్రయిస్తున్నాడు. తన మేధస్సుతో అతి తక్కువ ఖర్చుతో సోలార్, అలాగే వివిధ రకాల ప్రయోగాలు చేసి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా వస్తువులను తయారు చేశానని ఇప్పుడు రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే వందల టన్నుల ప్లాస్టిక్ వస్తువులను కూడా పైపులుగా మార్చి వాటిని మళ్లీ ఉపయోగపడే విధంగా చేస్తానని చెబుతున్నాడు. పట్టణాల్లో మురికి నీరు నిలువ ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు అవుతాయని, డ్రైనేజీ నిర్మించేటప్పుడే పైపులు అందులో అమర్చితే నీరు వృధాగా పోకుండా ఉంటుందని చెబుతున్నాడు..
ప్రభాస్ ఇండస్ట్రీస్ పేరుతో వ్యవసాయ, పారిశ్రామిక రంగం విద్యుత్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇలా పలు అంశాలకు సంబంధించిన వస్తువులు తయారుచేసి తక్కువ ఖర్చుతో అందజేస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి సుమారు నాలుగు నుండి ఐదు కోట్ల పెట్టుబడి పెడితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసి వాటిని ఇంకుడు గుంతలకు, వివిధ రకాలుగా ఉపయోగపడే విధంగా పైపులను తయారు చేసే విధంగా చేస్తారని చెబుతున్నాడు. ప్రతిసారీ ఏదో ఒక ప్రయోగం చేస్తూ ముందుకు వెళుతున్న ప్రభాకర్ ఇప్పుడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ నియంత్రణ కోసం చేస్తున్న ప్రయోగాన్ని ప్రభుత్వం గుర్తించాలని మనం కోరుకుందాం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




