న్యూ ఇయర్ స్పెషల్.. సందర్శించడానికి మహారాష్ట్రలోని బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే!
samatha
Pic credit - Instagram
న్యూ ఇయర్ వచ్చేస్తోంది. సెలువులు కూడా వస్తుండటంతో చాలా మంద ఈ సమయంలో ట్రిప్ వెళ్లడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.
అయితే న్యూ ఇయర్ సమయంలో ప్రకృతిలో స్నేహితులతో ఎంజాయ్ చేయాలనుకుంటే, మహారాష్ట్రాలో సందర్శించడానికి ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే.
లోనావాలా : ముంబై, పూణేకు కొద్ది దూరంలో ఉన్న ప్రశాంతమైన సరస్సులు, కొండ, టైగర్స్ లీప్, లయన్స్ పాయింట్ గుహలు చాలా అద్భుతంగా ఉంటాయి.
మాథెరన్ : భారతదేశంలో ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్స్‌లో ఒక్కటైన మాథెరన్, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడి విశాలమైన వ్యూపాయింట్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.
ఇగత్పురి, నాసిక్ జిల్లాలో ఉన్న హిల్ స్టేషన్స్, మేఘాలతో కప్పేసినట్లు కనిపించడమే కాకుండా, జలపాతాలు, అందమైన రైలు ఘాట్లతో చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.
సరస్సు ప్రేమికులకు అద్భుతమైన ప్రదేశాల్లో భండార్ధర ఒకటి. ఇక్కడ చుట్టూ జలపాతాలు, అందమైన ఎత్తైన చెట్లు, ట్రెక్కింగ్ స్పాట్, చాలా అద్భుతంగా ఉంటాయి.
మహేబలేశ్వర్, సహ్యాద్రి రాణి అని పిలవబడే ఈ హిల్ స్టేషన్, స్ట్రాబెర్రీ తోటలు, జలపాతాలతో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
చలికాలంలో అద్భుతమైన జలపాతాలు , పచ్చదనంతో నిండి ఉండే, మల్షేజ్ ఘాట్, పక్షులను వీక్షించడానికి ఉండే అందమైన ప్రదేశాల్లో ఒకటి.