Mobile Alert: టాయిలెట్ వెళుతూ ఫోన్‌ను తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. నపుంసకులుగా మారే ప్రమాదం ఉందట..!
Men Health: ప్రస్తుత కాలంలో మొబైల్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగమైపోయింది. ముఖ్యంగా యువత తమ పనులన్నింటికీ ఫోన్‌పై ఆధారపడుతున్నారు. ప్రత్యేకంగా వస్తువులను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకున్నట్లే.. ఫోన్‌లను కూడా ఎప్పుడూ వెంటే ఉంచుకుంటారు. ఇక కొందరుంటారు చాలా మంది తమ ఫోన్‌లను ఎప్పుడూ తమ దగ్గరే ఉంచుకుంటారు. ఎంతలా అంటే.. ఆఖరికి టాయిలెట్‌కి వెళ్లినా ఫోన్‌ను తమ వెంటే తీసుకెళ్తుంటారు. వంట గదిలో వంట చేస్తున్నా.. ఏ పని చేస్తున్నా వెంట ఫోన్ ఉండాల్సిందే.
Men Health: ప్రస్తుత కాలంలో మొబైల్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగమైపోయింది. ముఖ్యంగా యువత తమ పనులన్నింటికీ ఫోన్‌పై ఆధారపడుతున్నారు. ప్రత్యేకంగా వస్తువులను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకున్నట్లే.. ఫోన్‌లను కూడా ఎప్పుడూ వెంటే ఉంచుకుంటారు. ఇక కొందరుంటారు చాలా మంది తమ ఫోన్‌లను ఎప్పుడూ తమ దగ్గరే ఉంచుకుంటారు. ఎంతలా అంటే.. ఆఖరికి టాయిలెట్‌కి వెళ్లినా ఫోన్‌ను తమ వెంటే తీసుకెళ్తుంటారు. వంట గదిలో వంట చేస్తున్నా.. ఏ పని చేస్తున్నా వెంట ఫోన్ ఉండాల్సిందే. చేతిలో ఫోన్ లేకుండా.. వెలితిగా ఫీలవుతారు. అందుకే ప్రతి చోటుకి తమ వెంట ఫోన్‌ను తీసుకెళ్తుంటారు. అయితే మీరు చేసే కొన్ని తప్పులు ఆరోగ్య పరంగా ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి.
ఈ తప్పుల వల్ల.. తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇది మీ DNA ని సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. అంతకంటే.. ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. నపుంసకులు అయ్యే అవకాశం ఉందట. ఇలాంటి సమస్యలన్నింటికీ కారణం.. మీరు మీ ఫోన్‌ను టాయిలెట్‌కి తీసుకెళ్లడమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. టాయిలెట్‌కు మొబైల్ తీసుకెళ్లడం వలన కలిగే ప్రమాదాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫోన్‌ని టాయిలెట్‌కి తీసుకెళ్లడం ప్రమాదకరం..
- మరుగుదొడ్లు ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు నిలయం. ఎవరైనా టాయిలెట్‌లో ఫోన్‌ని ఉపయోగించి, ఆ తర్వాత శుభ్రం చేయకపోతే, బ్యాక్టీరియా ఫోన్‌కు అంటుకుంటుంది. ఇది కడుపులో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇది కాకుండా, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.
- టాయిలెట్‌లో కూర్చొని చాలా సమయం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి బయటకు వచ్చాక చేతులు కడుక్కుంటారు. మరి మీ ఫోన్ సంగతి ఏంటి? మీ ఫోన్‌ను ఎలా క్లీన్ చేస్తారు? టాయిలెట్ నుండి వచ్చిన తర్వాత ఎవరూ ఫోన్‌ను క్లీన్ చేయరు? అలాంటి పరిస్థితిలో ఫోన్‌పై చేరిన ప్రమాదకరమైన బ్యాక్టీరియా మీ బెడ్‌కి, కిచెన్‌కి వస్తుంది. దాని వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతారు.
- వైద్య నివేదికల ప్రకారం.. ఫోన్‌ను ఎక్కువసేపు జేబులో ఉంచుకుని, వైర్‌లెస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడితే.. శరీరం 10 రెట్లు రేడియేషన్‌ను ఎదుర్కొంటుందట. రేడియేషన్ క్యాన్సర్‌కు కూడా కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ రేడియేషన్ మీ DNA నిర్మాణాన్ని కూడా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదండోయ్.. నపుంసకత్వ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇది కాకుండా, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా రెట్టింపు చేస్తుంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..