Finger Personality: మీ చేతి మధ్య వేలు ఇలా ఉందా..? అయితే తిరుగుండదు పోండి..
మాటలు, ప్రవర్తనలతోనే కాదు... మన చేతి మధ్య వేలు మన వ్యక్తిత్వాన్ని తెలిపే కీలక సంకేతం అంటుంది జ్యోతిషశాస్త్రం. వేలు పొడవు, మందత్వం, ఆకారం ఆధారంగా వ్యక్తుల స్వభావం అంచనా వేసే అనుభవజ్ఞులున్నారు. మధ్య వేలు ఎలా ఉంటో.. ఎలాంటివారు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం...

ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే మనం ఏం చూస్తాం? ఆయన మాటల శైలి, జీవన విధానం, ప్రవర్తన… కానీ వీటన్నింటికీ మించిన సంకేతాన్ని ఇచ్చేవి చేతి వేళ్లు అని మీకు తెలుసా?. అవును జ్యోతిషశాస్త్రం ప్రకారం మన చేతుల నిర్మాణం, ప్రత్యేకంగా మధ్య వేలు మన వ్యక్తిత్వం, మన ఆత్మస్థితి, మన జీవన దిశ గురించి ఎన్నో విషయాలు చెబుతుంది. ఈ మధ్య వేలు పొడవు, మందత్వం, ఆకారం ఇలా ఒక్కో లక్షణం ఒక్కో అర్థాన్ని కలిగి ఉంటుంది.
చూపుడు వేలుకంటే మధ్య వేలు పొడవుగా ఉందా?: అయితే మీరు జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన వారై ఉండవచ్చు. కష్టానికి అస్సలు భయపడరు. ఆ కష్టం చివరకు మీ విజయానికి బాట వేసి ఉంటుంది.
మీ మధ్య వేలు మందంగా లేదా వాపుగా ఉందా?: ఇది మీలో స్వార్థపు స్వభావం ఉన్న సూచన కావచ్చు. మీరు మీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల భావాలు పెద్దగా పట్టించుకోరు.
మధ్య వేలు చాలా పొడవుగా ఉందా?: అయితే మీరు గొప్ప వ్యక్తి. మీరు జీవితం నుంచి గౌరవాన్ని, గుర్తింపును, పేరు ప్రతిష్టను పొందే వ్యక్తి. మీరు విజేతగా నిలిచే అవకాశం అధికంగా ఉంటుంది.
మీ మధ్య వేలు చిన్నగా, సన్నగా ఉందా?: అయితే మీరు అంతర్గతంగా చాలా నిగూఢమైన వ్యక్తి. మీలో ఏదో లోతైన ప్రపంచం ఉంది. ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఈజీ కాదు. మీరు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటారు.
మనిషి శరీర నిర్మాణమే ఒక రహస్య భాషలా ఉంటుంది. చేతిరాతల శాస్త్రం ప్రకారం… మధ్య వేలు మన భవిష్యత్తు, మన మార్గం, మన లోతుల్ని సూచించే కీలక సంకేతం.
ఈ కథనంలో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీని ప్రామాణికతను టీవీ9 ధృవీకరించడం లేదు.




