AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venomous Snake: ఓ భర్త దుర్మార్గం.. విష సర్పంతో కాటువేయించి భార్యకూతురి హత్య! ఆ బంధానికి అడ్డుగా ఉన్నారనీ

కట్టుకున్న భార్యను, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ఓ కసాయి భర్త దారుణంగా హతమార్చాడు. పడక గదిలో విషసర్పంతో కాటు వేయించి మరీ భార్య కూతురిని దారుణంగా చంపాడు. నిందితుడిని పోలీసులు గురువారం (నవంబర్ 24) అరెస్టు చేశారు. కబీర్‌సూర్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధేగావ్‌లో నెలన్నర క్రితం ఈ ఘటన జరగగా.. పోలీసుల దర్యాప్తులో ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే. ఒరిస్సాలోని గంజమ్‌ జిల్లా కబీర్ సూర్యనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అధీబరా గ్రామంకి చెందిన గణేష్ పాత్ర (25) , బసంతి పాత్ర (23)లకు 2020లో వివాహం జరిగింది. వీరికి..

Venomous Snake: ఓ భర్త దుర్మార్గం.. విష సర్పంతో కాటువేయించి భార్యకూతురి హత్య! ఆ బంధానికి అడ్డుగా ఉన్నారనీ
Venomous Snake
Srilakshmi C
|

Updated on: Nov 24, 2023 | 1:18 PM

Share

ఒడిశా, నవంబర్‌ 24: కట్టుకున్న భార్యను, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని ఓ కసాయి భర్త దారుణంగా హతమార్చాడు. పడక గదిలో విషసర్పంతో కాటు వేయించి మరీ భార్య కూతురిని దారుణంగా చంపాడు. నిందితుడిని పోలీసులు గురువారం (నవంబర్ 24) అరెస్టు చేశారు. కబీర్‌సూర్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధేగావ్‌లో నెలన్నర క్రితం ఈ ఘటన జరగగా.. పోలీసుల దర్యాప్తులో ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..

ఒరిస్సాలోని గంజమ్‌ జిల్లా కబీర్ సూర్యనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అధీబరా గ్రామంకి చెందిన గణేష్ పాత్ర (25) , బసంతి పాత్ర (23)లకు 2020లో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె సంతానం. కొంతకాలంపాటు వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగినా ఆ తర్వాత నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. గణేష్‌ ఇతర మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బసంతి పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. వేరే మహిళతో సహజీవనం చేస్తున్న గణేష్‌ భార్యపిల్లలను అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో వీరి హత్యకు పథకం పన్నాడు. సెప్టెంబర్ 26న గణేష్ తన తండ్రి పేరుతో సిమ్ కార్డును కొన్నాడు. శివాలయంలో మతపరమైన ఆచారాలు జరుపుకోవాలనే సాకుతో పాముల బసంత ఆచార్య అనే మంత్రగాడి నుంచి అక్టోబర్ 6న పామును కొని ఇంటికి తీసుకొచ్చాడు. ప్లాస్టిక్‌ జార్‌లో పామును తెచ్చాడు. అందుకు కొత్త సిమ్‌ను వినియోగించాడు.

అర్ధరాత్రి 2 గంటల సమయంలో భార్య బసంతి పాత్ర (23), కుమార్తె దేబస్మిత (2) నిద్రిస్తున్న గదిలో పామును విడిచిపెట్టాడు. మరుసటి రోజు ఉదయం నాటికి పాము కాటుకు గురై తల్లి, కూతురు అపస్మారక స్థితిలో కనిపించారు. ఈ సంఘటన ఈ ఏడాది అక్టోబర్‌ 7వ తేదీన చోటుచేసుకుంది. తెల్లారిన తర్వాత ఏమీ ఎరగనట్టు తన భార్య, కూతురు అస్వస్థతకు గురయ్యారని గణేష్‌ నంగనాచి ఏడుపు మొదలెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య బసంతి తల్లిదండ్రులతోపాటు ఇరుగు పొరుగు వారి ఇంటికి చేరుకుని, తల్లీకూతుళ్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. పోస్టుమార్టం రిపోర్టులో పాముకాటు వల్లే తల్లీకూతుళ్లు మృతి చెందినట్లు నిర్ధారించారు. బసంతి తండ్రి.. అల్లుడిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు నిందితుడు గణేష్‌గా తేల్చారు. ఈ సంఘటన జరగడానికి ముందు 3 నెలల ముందు నుంచి మాత్రమే వీరు మళ్లీ కలిసి ఉంటున్నారని ఎస్పీ జగన్మోషన్‌ మీనా వివరించారు. గణేష్, అతని భార్య కె బసంతి పాత్ర మధ్య వైవాహిక విభేదాలు ఈ సంఘటనకు దారితీసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మొదట అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత నేరం నిరూపించేందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితుడిని అరెస్ట్ చేయడం ఆలస్యమైందని ఎస్పీ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!