Avoid Sleep: ఆఫీసులో నిద్రొచ్చినట్లుగా.. మజ్జుగా అనిపిస్తోందా.. అయితే ఈ చిన్న టిప్‌తో ఫ్రెష్‌గా ఉండండి.. ఏం చేయాలంటే..
Office Tips: ఆఫీసులో పని చేస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తే..ఈ చిట్కాలతో తిరిగి రీ ఫ్రెష్ అవ్వండి.. నిద్ర మత్తును వదిలించుకునే ఈ టిప్స్ మీకు అద్భుతంగా పని చేస్తాయి.. అవేంటంటే..

మంచి ఆరోగ్యం కోసం తగినంత నిద్ర అవసరం. నేటి ఉరుకులు.. పరుగుల జీవనశైలిలో సరిపోయేంత నిద్ర లభించడం లేదు. చాలా మంది తరచుగా తగినంత నిద్రకు దూరమవుతున్నారు. ఈ కారణంగా పని చేస్తున్న సమయంలో నిద్ర, లేజీగా ఉంటున్నారు. ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు మీకు కూడా నిద్ర వస్తున్నట్లయితే.. ఈ వార్త మీ కోసమే.. ఈ రోజు మనం ఇలాంటి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.. వీటితో నిద్రొచ్చినప్పుడు.. మజ్జుగా ఉన్నప్పుడు ఈ టిప్స్‌ను ఫాలో అవుదాం. ఈ టిప్స్‌తో ఆఫీసులోనే కాదు చదువుతున్నప్పుడు కూడా ఉత్సాహంగా ఉండొచ్చు.. అవేంటో తెలుసుకుందాం..
ఆరోగ్యకరమైన ఆహారం ఎంచుకోండి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిద్రను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. మనం ఎక్కువ కొవ్వు పదార్ధాలను తీసుకుంటే.. అది బద్ధకాన్ని కలిగిస్తుంది. అంతే కాదు నిద్రతోపాటు రోజంతా మజ్జుగా మారుతుంది. పని సమయంలో నిద్రలేమిని నివారించడానికి సూప్‌లు, సలాడ్‌లు, పండ్లు, కూరగాయలు వంటి పోషకాలు కలిగినవి కాని.. ఫైబర్‌తో కూడిన సమతుల్య ఆహారం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి.
పవర్ న్యాప్ తీసుకోండి
మీరు చాలా గంటలు ఒకే చోట కూర్చుని చదువుకుంటే లేదా ఏదైనా పని చేస్తే.. నిద్ర ముంచుకొస్తుంది. ఆఫీసు సమయంలో లేదా చదువుతున్నప్పుడు ఎక్కువ మజ్జుగా అనిపస్తే.. మధ్యలో కాసేపు పవర్ న్యాప్ తీసుకోవాలి. పవర్ నాప్ మీ కోసం ఎనర్జీ బూస్టర్ కంటే తక్కువ కాదు. ఇది మీకు ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
తగినంత నీరు త్రాగాలి
పని చేసేటప్పుడు లేదా చదువుతున్నప్పుడు మజ్జుగా అనిపిస్తుందంటే.. మీరు తగినంత నీరు త్రాగడం కూడా కారణం కావచ్చు. ఒక అధ్యయనం ప్రకారం, తక్కువ నీరు తాగడం వల్ల నీరసం వస్తుంది. దీన్ని నివారించడానికి, ఎల్లప్పుడూ మీ డెస్క్‌పై నీటిని ఉంచుకోండి. మీరు నిద్రిస్తున్నప్పుడు నీరు ఎక్కువగా త్రాగాలి.
నడవండి
మీరు పనిలో ఉన్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు నిద్రలోకి జారుకున్నప్పుడు.. మీరు చిన్న నడక కూడా తీసుకోవచ్చు. ఇది మీ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇలా చేస్తే మీకు తాజా అనుభూతిని పొందుతారు. అందువల్ల, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకండి.
టీ లేదా కాఫీ
టీ లేదా కాఫీ తాగడం వల్ల నిద్రకు బ్రేక్ వేయవచ్చు. టీ, కాఫీలో కెఫీన్ ఉంటుంది.. ఇది నిద్రకు బ్రేక్ వేడయంలో సహాయపడుతుంది. అయితే టీ, కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా శరీరంపై చెడు ప్రభావం పడుతుందని గుర్తుంచుకోండి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం
