AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Marriage Systems: హిందూ వివాహ వ్యవస్థలో ఎన్నిరకాల పెళ్లిళ్లు ఉన్నాయో తెలుసా? వీటిలో కట్నం ప్రసక్తి ఉందేమో చూడండి..

సనాతన సంప్రదాయంలోని పదహారు మతకర్మలలో ఒకటి వివాహ మతకర్మ, ఇందులో గృహస్థ జీవితంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. తల్లితండ్రుల ఋణం తీర్చుకోవడానికి ఈ వ్రతం చేస్తారు.

Hindu Marriage Systems: హిందూ వివాహ వ్యవస్థలో ఎన్నిరకాల పెళ్లిళ్లు ఉన్నాయో తెలుసా? వీటిలో కట్నం ప్రసక్తి ఉందేమో చూడండి..
Marriage
KVD Varma
|

Updated on: Nov 27, 2021 | 10:37 AM

Share

Hindu Marriage Systems: సనాతన సంప్రదాయంలోని పదహారు మతకర్మలలో ఒకటి వివాహ మతకర్మ, ఇందులో గృహస్థ జీవితంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. తల్లితండ్రుల ఋణం తీర్చుకోవడానికి ఈ వ్రతం చేస్తారు. మనం హిందూ మతం వివాహ ఆచారాలు కాలక్రమేణా చాలా మారిపోయాయి. ఇప్పుడు పెళ్లి అంటే అబ్బో రకరకాలుగా ఉంటుంది. ఎంత డబ్బుంటే అంత ఆడంబరం. పెళ్ళిలో చేయాల్సిన తంతుకు సంబంధించి పెద్దగా పట్టింపు ఏమీ ఉండడం లేదు. ప్రపంచంలో హిందూ వివాహ వ్యవస్థ.. కుటుంబ వ్యవస్థలపై చాలా గౌరవం ఉంది. నిజానికి ప్రాచీన కాలంలో భారతదేశంలో ఎనిమిది రకాల హిందూ వివాహాలు ప్రబలంగా ఉండేవి. ఈ ఎనిమిది రకాల వివాహాలు వాటి స్వంత ఆచారాలు, కారణాలను కలిగి ఉండేవి. దేని ప్రత్యేకత దానిదే. సనాతన సంప్రదాయానికి సంబంధించిన ఆ ఎనిమిది రకాల వివాహాల గురించి తెలుసుకుందాం.

బ్రాహ్మణ వివాహం

ఈ వివాహం అత్యంత ప్రజాదరణ పొందింది. అలాగే దీనిని ఉత్తమమైన రకంగా చెబుతారు. ఇది నేటికీ కొనసాగుతోంది. ఇందులో వధూవరులిద్దరి అంగీకారంతో ఒకే తరగతికి చెందిన తగిన వరుడితో అమ్మాయి పెళ్లి నిశ్చయిస్తారు. ఇందులో యువతి వివాహం తర్వాత వరుడితో కలిసి పుట్టింటి వద్ద వీడ్కోలు తీసుకుని మెట్టినింటికి వెళుతుంది.

దైవ వివాహం

దైవ వివాహంలో, తండ్రి తన కుమార్తెను ఒక ప్రత్యేక కర్మ (దేవయాజ్ఞ) చేసే పూజారికి ఇస్తాడు. ఈ రకమైన వివాహంలో వధువు దక్షిణగా ఇస్తారు. దీనిని దేవయజ్ఞం సందర్భంగా నిర్వహిస్తారు కాబట్టి దీనిని దైవ వివాహం అంటారు.

ఆర్ష వివాహం

వరుడు వధువు తండ్రికి ఒక జత ఆవులను లేదా ఎద్దులను ఇచ్చి వివాహం చేసినప్పుడు, దానిని ఆర్ష వివాహం అంటారు. అయితే, అటువంటి మార్పిడి ఉద్దేశ్యం యజ్ఞం కోసం మాత్రమే అయివుంటుంది.

ప్రజాపత్య వివాహం

ప్రజాపత్య వివాహాలలో, తండ్రి, తన కుమార్తె సమ్మతి లేకుండా వివాహం చేస్తాడు. వరుడి ఇంటి వద్ద పౌర, మతపరమైన విధులను నెరవేర్చడానికి,బిడ్డలకు జన్మనివ్వాలనే ఉద్దేశ్యంతో వరుడి సమ్మతితో వధువు తండ్రి వివాహం చేస్తాడు.

అసుర వివాహం

ఒక వ్యక్తి తనకు చేతనైనంత డబ్బు ఇచ్చి లేదా కొనుగోలు చేసి ఒక అమ్మాయిని స్వేచ్ఛగా పెళ్లి చేసుకోవడాన్ని అసుర వివాహం అంటారు. పెళ్లి అనేది ఒక రకమైన బేరం, డబ్బు లేదా ఇతర విలువైన వస్తువులు ఇచ్చి చేసుకునే కార్యక్రమంగా ఇది ఉంటుంది.

గాంధర్వ వివాహం

కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా, ఎలాంటి లాంఛనప్రాయం లేకుండా జరిగే వధూవరుల వివాహాన్ని ‘గాంధర్వ వివాహం’ అంటారు. గాంధర్వ వివాహంలో, స్త్రీ- పురుషుడు ఒకరితో ఒకరు లైంగిక సంబంధం కలిగి ఉంటారు.

రాక్షస వివాహం

యువతితో పాటు ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి, యువతి పక్షాల అంగీకారం లేకుండా బలవంతంగా పెళ్లి చేయడాన్ని ‘రాక్షస వివాహం’ అంటారు. రాక్షస వివాహం యుద్ధం ద్వారా వెలుగులోకి వచ్చిందని చెబుతారు.

పిశాచ వివాహం

ఆడపిల్ల నిస్సహాయత, మానసిక దౌర్బల్యం మొదలైన వాటిని సద్వినియోగం చేసుకొని ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకోవడాన్ని ‘పిశాచ వివాహం’ అంటారు.

(ఇక్కడ అందించిన సమాచారం మత విశ్వాసాలు,జానపద విశ్వాసాలపై ఆధారపడింది. వివిధ సందర్భాలలో పురాణాలు.. చారిత్రక కథలలో పేర్కొన్న విషయాల ఆధారంగా ఇది ఇవ్వడం జరిగింది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అందించడం జరిగింది.)

ఇవి కూడా చదవండి: Tomato Price: టమాటా ధరల పులుపు ఘాటు తగ్గాలంటే అప్పటిదాకా ఆగాల్సిందే.. ఎందుకంటే..

Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్న ఈ కంపెనీకి దూరంగా ఉండండి.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. ఎందుకంటే..

Diabetes: చక్కర వ్యాధి ఉన్నవారు చలికాలంలో ఈ ఆహారపదార్ధాల జోలికి వెళితే డేంజర్.. జాగ్రత్త!