Hijab Controversy: హిజాబ్ అంటే ఏమిటి.. దీనిపై కర్నాటకలో జరుగుతున్న రచ్చ ఏంటి..?

Hijab Controversy: ముస్లిం యువతులు హిజాబ్ ధరించడంపై కర్ణాటకలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టులో ఉండడంతో దీనిపై రాజకీయం కూడా కొనసాగుతోంది.

Hijab Controversy: హిజాబ్ అంటే ఏమిటి.. దీనిపై కర్నాటకలో జరుగుతున్న రచ్చ ఏంటి..?
Hijaab
Follow us
uppula Raju

|

Updated on: Feb 08, 2022 | 1:14 PM

Hijab Controversy: ముస్లిం యువతులు హిజాబ్ ధరించడంపై కర్ణాటకలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులో ఉండగా.. మరో వైపు ఇదే అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇటీవల ముస్లిం మహిళలు హిజాబ్‌  ధరించడంపై  అవగాహన కల్పించడానికి ఫిబ్రవరి 1 న ప్రపంచ హిజాబ్ దినోత్సవాన్ని నిర్వహించారు. దీని తర్వాత హిజాబ్‌ వివాదం మరింత పెరిగింది.  చాలామంది ముస్లిం మహిళలు హిజాబ్‌కు అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే ముస్లిం అమ్మాయిలకు హిజాబ్ ఎందుకు అవసరం.. అలాగే హిజాబ్‌, నిఖాబ్, బుర్ఖా, దుపట్టాలకు తేడా ఏంటి.. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

హిజాబ్ అంటే ఏమిటి?

హిజాబ్‌కి నిఖాబ్‌కి చాలా తేడా ఉంటుంది. హిజాబ్ అంటే తెర. హిజాబ్ జుట్టును పూర్తిగా కప్పి ఉంచాలి. హిజాబ్‌లో మహిళలు తమ జుట్టును మాత్రమే కప్పుకుంటారు. మహిళలు తల, మెడను ఏదైనా క్లాత్‌తో కప్పి ఉంచడాన్ని హిజాబ్ అంటారు. కానీ ముఖం మాత్రం కనిపిస్తుంది.

బురఖా అంటే ఏంటి..

బురఖా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. తల నుంచి కాళ్ల వరకు శరీరాన్ని మొత్తం కప్పి ఉంచుతుంది. కళ్ళపై ఒక వీల్ ఉంటుంది. బురఖా ధరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు. చాలా దేశాల్లో దీనిని అబాయా అని కూడా అంటారు.

నికాబ్‌ అంటే ఏమిటి?

నికాబ్‌ అనేది ఒక రకమైన క్లాత్‌ మాస్క్‌. ఇది  ముఖంపై ఉంటుంది. ఇందులో మహిళ ముఖం కనిపించదు. కానీ కళ్లు మాత్రం కనిపిస్తాయి.

దుపట్టా అంటే ఏంటి..

దుపట్టా అనేది చాలా సాధారణమైన వస్త్రం. ఇది ఒక రకమైన పొడవాటి కండువా లాంటిది. ఇది తలపై నుంచి కప్పబడి ఉంటుంది. దక్షిణ ఆసియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు. హిజాబ్ లాగా బిగుతుగా ఉండదు.

హిజాబ్‌ వివాదం ఏంటి..

కర్నాటకలోని ఓ ప్రభుత్వ కళాశాలలో తరగతి గదిలో హిజాబ్ ధరించడాన్ని నిరాకరించడంతో హిజాబ్ వివాదం మొదలైంది. దీనిపై 8 మంది ముస్లిం విద్యార్థినులు నిరసన వ్యక్తంచేశారు. తరువాత చాలా కాలేజీల్లో ఈ వివాదం మొదలైంది. ఈమధ్య ఓ కాలేజీలో హిజాబ్ ధరించిన అమ్మాయిలను విడిగా కూర్చోబెట్టారు. ఈ విషయంపై నిరంతర నిరసనలు కొనసాగుతున్నాయి.

Cigarette: సిగరెట్ మానేసిన రెండో రోజు నుంచే మార్పులు.. 3 నుంచి 6 వారాల్లో ఎంత తేడా అంటే..?

Headache: కొవిడ్‌ తగ్గినా తలనొప్పి తగ్గడం లేదా.. టాబ్లెట్స్‌ కన్నా ఈ ఆయుర్వేదం బెస్ట్..?

IPL 2022: విరాట్‌ కోహ్లీ పెద్ద విషయం వెల్లడించాడు.. వేలంలోకి రాకపోవడానికి అదే కారణమట..?