Wi-Fi Signals: మీ వై-ఫై స్పీడ్ తగ్గిందా? అయితే ఇలా చేయండి.. వై-ఫై స్పీడ్‌ను పెంచుకోండి..

Wi-Fi Signals: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏ పని చేయాలన్నా ఇంటర్నెట్ తప్పనిసరి..

Wi-Fi Signals: మీ వై-ఫై స్పీడ్ తగ్గిందా? అయితే ఇలా చేయండి.. వై-ఫై స్పీడ్‌ను పెంచుకోండి..
Follow us

|

Updated on: Jan 26, 2021 | 8:59 PM

Wi-Fi Signals: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏ పని చేయాలన్నా ఇంటర్నెట్ తప్పనిసరి అయిపోయింది. ఇక కరోనా కాలంలో ఇంటర్నెర్ ఏ రకంగా అనివార్యం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు చాలా మంది తమ తమ ఇళ్ల నుంచే విధులు నిర్వర్తించారు. ఇప్పటికీ పలు సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరోవైపు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ఆన్‌లైన్ క్లాస్‌ లు వింటున్నారు.

అయితే, వీరు విధులు నిర్వహించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఒకటికి మించి ఎలక్ట్రానిక్ డివైజ్‌కి ఇంటర్నెట్ వినియోగించాలంటే మాత్రం ‘వై-ఫై’ తప్పనిసరి. ‘వై-ఫై’ కారణంగానే ఎంతో మంది ఉద్యోగులు, విద్యార్థులు తమ తమ కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అయితే, ఒక్కోసారి ఈ వై-ఫై కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. నెట్ సరిగా అందక పనులు జరగని పరిస్థితి కూడా ఉంటుంది.

దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటికి మించి డివైజ్‌లకు వై-ఫైని కనెక్ట్ చేయడం, ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండటం వంటి కారణాల చేత వినియోగదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, వై-ఫై వేగాన్ని పెంచడానికి ఈ చిన్న పనులు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఒకసారి పరిశీలిద్దాం.

వై-ఫై స్పీడ్ పెంచడానికి ఇవి చేసి చూడండి.. 1. ముందుగా మన అవసరాలను బట్టి వై-ఫై రూటర్‌ని ఎంపిక చేసుకోవాలి. డ్యూయల్ బ్యాండ్ 2.4 గిగాహెర్ట్జ్ నుంచి 5 గిగా హెర్ట్జ్ బ్యాండ్ ఫ్రీక్వెనీ వరకు మనకు ఏది అవసరమో గుర్తించి దానిని ఎంచుకోవాలి. 2. వై-ఫై స్పీడ్‌ను చెక్ చేయాలి. ఒక్కోసారి మనం వాడుతున్న డివైజ్‌లలోనే సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వై-ఫై వేగాన్ని చెక్ చేసి.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు. 3. అవసరం ఉన్న డివైజ్‌లకు మాత్రమే వై-ఫైని కనెక్ట్ చేయాలి. అవసరం లేని వాటికి డిస్‌కనెక్ట్ చేస్తే వై-ఫై సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. 4. ఒక్కోసారి యాంటెన్నా సమస్య కూడా ఉంటుంది. దానిని చెక్ చేస్తుండాలి. రూటర్‌కు సంబంధించి యాంటెన్నా పొజిషన్ మార్చి సిగ్నల్‌ను చెక్ చేస్తే సరిపోతుంది. 5. వై-ఫై రూటర్ పక్కన నిలబడినప్పుడు మాత్రమే సిగ్నల్ వచ్చినట్లయితే.. ఆ రూటర్ స్థానాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. గదిలో సెంటర్‌గా రూటర్ స్థానం ఉండేలా చూడాలి. 6. రూటర్ పక్కన ఎలాంటి ఐరన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా చూడాలి. 7. అలాగే చుట్టుపక్కన ఇత నెట్‌వర్క్‌లకు నుంచి వచ్చే సిగ్నల్స్ కూడా వై-ఫై తగ్గడానికి కారణాలవుతాయి. కావున మీ రౌటర్‌లో ఛానల్ ఎంపిక మోడ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది.

ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల వై-ఫై తగ్గే అవకాశం ఉన్నందు వీటి అంశంలో జాగ్రత్తలు పాటిస్తే వై-ఫై వేగాన్ని పెంచుకోవచ్చు.

Also read:

సీఎస్‌ను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాలు.. ఎన్నికల విధులకు మూడు విజ్ఞప్తులను సీఎస్‌ ముందుంచిన ఉద్యోగులు

Moderna COVID-19 Vaccine: భారత్ లో కరోనా నివారణకు మోడెర్నా టీకా క్లినికల్ ట్రయల్స్ కు టాటా ప్రయత్నాలు..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన