Eating Late and Weight Gain: రాత్రి 8 తర్వాత తీసుకునే ఆహారం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి తెలుసా..!
కొన్ని ఏళ్ల క్రితం వరకు అంటే టీవీలు.. శాటిలైట్ ఛానల్.. ఎంఎన్ సీ కంపెనీల్లో ఉద్యోగాలు లేని సమయం వరకూ.. తెల్లవారు జామునే నిద్ర లేవడం దగ్గర నుంచి ఆహారం తినే విషయం వరకూ అన్నీ నియమావళిని అనుసరించి జరిగేవి.. ఉదయం 4 గంటలకే...
Eating Late and Weight Gain: కొన్ని ఏళ్ల క్రితం వరకు అంటే టీవీలు.. శాటిలైట్ ఛానల్.. ఎంఎన్ సీ కంపెనీల్లో ఉద్యోగాలు లేని సమయం వరకూ.. తెల్లవారు జామునే నిద్ర లేవడం దగ్గర నుంచి ఆహారం తినే విషయం వరకూ అన్నీ నియమావళిని అనుసరించి జరిగేవి.. తెల్లవారు జాము 4 గంటలకే నిద్రలేచి.. ఆడామగ తమ పనులను ప్రారంభించే వారు.. ఇక ఆహారం తీసుకోవడానికి కూడా సమయం పాటించే వారు.. ఇక రాత్రి 7 గంటలకి భోజనం చేసి.. త్వరగా నిద్రకు ఉపక్రమించే వారు.. తర్వాత తర్వాత కాలంలో మనిషి జీవితాన్ని చాలా వరకూ టీవీలు ప్రభావితం చెయ్యడం మొదలు పెట్టాయి. ఇక శాటిలైట్ ఛానల్స్ వచ్చక ఆహార నియమల్లో నిద్ర సమయంలో మార్పులు చోటు చేసుకొన్నాయి.. కాగా తాజాగా రాత్రి 8 గంటల తర్వాత ఆహారం తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఆహార నియమాలు అందరికీ ఒకేలా ఉండవు.. ఎక్కువ మంది రాత్రి 8 గంటల తర్వత ఆహారం తింటారు.. కానీ అలా 8 గంటల తర్వాత ఆహారం తింటే బాడీ మాస్ ఇండెక్స్ అధిక శాతం పెరుగుతుంది అట. రాత్రి 8 గంటల తర్వాత ఆహారం..లేదా స్నాక్స్ వంటి ఏ ఇతర ఆహార పదార్ధాలను తిన్నా శరీరంలో అధిక శాతం కొవ్వు పెరిగి బరువు అధికంగా పెరుగుతారట. అయితే రాత్రి 8 గంటల కంటే ముందు తినే వారికి బాడీ మాస్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అట.. అంతేకాదు పగలు తినే ఆహారం బట్టి మనిషి శరీర తత్వం తెలుస్తుంది.. ఇక నిద్ర పోయే సమయం కూడా ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది.. ఇక జంక్ ఫుడ్స్ కు అలవాటు పడిన వారికి అనేక ఆహార సమస్యలు తలెత్తుతాయని పరిశోధనలో తేలిందట.. ఇక సమయానికి ఆహారం తినే వారికి గ్యాస్టిక్ సమస్యలు తలెత్తవని.. శరీరంలో చాలా వరకూ వ్యాధులు గ్యాస్ సమస్య తోనే వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.. గ్యాస్ సమస్య తలెత్తకుండా కుండా ఉండాలంటే రోజూ నిర్ధిష్ట సమయంలో అన్నం తినడం రోజూ అరగంట వ్యాయామం చెయ్యడం ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు.. కనుక ఆహారం సమయానికి తిని మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి..