Moderna COVID-19 Vaccine: భారత్ లో కరోనా నివారణకు మోడెర్నా టీకా క్లినికల్ ట్రయల్స్ కు టాటా ప్రయత్నాలు..

మన దేశంలో తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకున్నాయని చెప్పవచ్చు.. తాజాగా భారత్ లో మరో టీకా అందుబాటులోకి రానున్నదని తెలుస్తోంది. భారత్ మోడెర్నా టీకాకు క్లినికల్ ట్రయల్స్ ...

Moderna COVID-19 Vaccine: భారత్ లో కరోనా నివారణకు మోడెర్నా టీకా క్లినికల్ ట్రయల్స్ కు టాటా ప్రయత్నాలు..
Follow us

|

Updated on: Jan 26, 2021 | 5:37 PM

Moderna COVID-19 Vaccine:  ప్రపంచ దేశాలు కరోనా వైరస్ నివారణ కోసం అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా వంటి పలు దేశాలు వ్యాక్సిన్ ను ఇస్తున్నాయి. అయితే మన దేశంలో తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకున్నాయని చెప్పవచ్చు.. ఇప్పటికే భారత్ లో తొలిదశలో జనవరి 16 నుండి ఇప్పటి వరకూ దాదాపు 16 లక్షల మందికి టీకాలు వేసినట్లు సమాచారం. మరోవైపు పలు దేశాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేస్తుంది. తాజాగా భారత్ లో మరో టీకా అందుబాటులోకి రానున్నదని తెలుస్తోంది. భారత్ మోడెర్నా టీకాకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ ముందుకొచ్చినట్లు సమాచారం.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థతో కలిసి క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై మోడెర్నా కానీ, టాటా సంస్థల నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నవంబర్ నెలలో విడుదలైన తుది దశ ప్రయోగ ఫలితాల్లో మోడెర్నా 94.1 శాతం సమర్థవంతమైందని వెల్లడైన విషయం తెలిసిందే. అలాగే, ప్రయోగాల సమయంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తలేదని సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ టీకాను అమెరికా, ఐరోపా దేశాలు అనుమతించి పంపిణీ చేస్తున్నాయి. ఇప్పుడు టాటా గ్రూప్ హెల్త్ కేర్ వెంచర్ ప్రయత్నాలు ఫలిస్తే భారతదేశంలో కూడా కోవిషీల్డ్, కోవాగ్జిన్ తర్వాత మోడెర్నా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ మోడెర్నా టీకాను సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు, ఇది భారతదేశం వంటి పేద దేశాలకు మరింత అనుకూలంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. మరోవైపు జైకోవిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు ట్రయల్స్ లో ఉన్నాయి.

Also Read: రాత్రి 8 తర్వాత తీసుకునే ఆహారం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి తెలుసా..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..