AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPS Account : మీ పెన్షన్ ఖాతా మూసివేయబడిందా..! అయితే యాక్టివేట్ చేసుకోవాలంటే ఇలా చేయండి..

NPS Account : ఎవరిదైనా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) ఖాతా మూసివేయబడితే దాన్ని మళ్లీ ఎలా ఓపెన్ చేయాలి. ఈ కరోనా సమయంలో

NPS Account : మీ పెన్షన్ ఖాతా మూసివేయబడిందా..! అయితే యాక్టివేట్ చేసుకోవాలంటే ఇలా చేయండి..
Nps Account
uppula Raju
|

Updated on: May 22, 2021 | 4:46 PM

Share

NPS Account : ఎవరిదైనా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) ఖాతా మూసివేయబడితే దాన్ని మళ్లీ ఎలా ఓపెన్ చేయాలి. ఈ కరోనా సమయంలో KYC ధృవీకరణ లేకపోవడం వల్ల NPS ఖాతాలు మూసివేయబడుతున్నాయి. దీనినే ఫ్రీజ్ అని కూడా అంటారు. ఒకవేళ మీరు KYC పూర్తి చేసినా ఇప్పుడది పెండింగ్‌లో ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో ఎన్‌పిఎస్ ఖాతా స్తంభించిపోతుంది. అటువంటి క్లోజ్డ్ ఖాతాను ఎలా రీ ఓపెన్ చేయాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ పద్ధతి దాదాపు అన్ని బ్యాంకులకు సమానంగా వర్తిస్తుంది.

మొదట ఎన్‌పిఎస్ ఖాతా ఎందుకు మూసివేయబడిందో తెలుసుకోవాలి. ఎన్‌పిఎస్‌ ఖాతాదారుడు ప్రతి సంవత్సరం కనీసం1000 రూపాయలు ఖాతాలో జమ చేయాలి. ఖాతాలో కనీస డిపాజిట్ మొత్తం 500 రూపాయలు. ఖాతాదారుడు అవసరమైన డిపాజిట్‌ను ఉంచకపోతే ఖాతా, PRAN (శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య) ఫ్రిజ్ చేయబడతాయి. ఇది బ్యాంకు వైపు నుంచి ఫ్రిజ్ గా పరిగణించబడుతుంది. దీన్ని మళ్లీ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం.

1 అప్లికేషన్ దీని కోసం మీరు ఫారమ్ నింపి మీకు ఎన్‌పిఎస్ ఖాతా ఉన్న బ్యాంకుకు ఇవ్వవచ్చు. PRAN ను పున ప్రారంభించడానికి UOS-S10-A ఫారమ్ నింపాలి. మీ ఎన్‌పిఎస్ ఖాతా నడుస్తున్న చోట బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో మీరు ఈ ఫారమ్ తీసుకోవచ్చు.

2.ఏ పేపర్లు ఇవ్వాల్సి ఉంటుంది మీరు పోస్టాఫీసు లేదా బ్యాంకుకు సమర్పించబోయే ఫారంతో పాటు PRAN కార్డు కాపీని జోడించండి. మీ NPS ఖాతాను పున ప్రారంభించడానికి PRAN కార్డ్ అవసరం. ఎన్‌పిఎస్ ఖాతా మూసివేయబడినప్పుడు ఈ కార్డు కూడా ఆగిపోతుంది. తరువాత రెండూ కలిసి ప్రారంభమవుతాయి.

3 చెల్లించాల్సిన రుసుము ఎంత? ఎన్‌పిఎస్ ఖాతాను యాక్టివేట్ చేయడానికి కొంత మొత్తాన్ని జమ చేయాలి. సాధారణ ఎన్‌పిఎస్ ఖాతాకు కనీస డిపాజిట్ మొత్తం రూ.500. ఈ మొత్తాన్ని ఇవ్వవలసి ఉంటుంది. దీంతో ఖాతా యాక్టివేట్ అవుతుంది. ఖాతా నాలుగేళ్లపాటు ఫ్రిజ్ అయితే అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

4- ధృవీకరణ ఖాతా ప్రారంభించడానికి దరఖాస్తును బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సమర్పించండి. జమ చేసిన డబ్బు ఆ ఆర్థిక సంవత్సరానికి కనీస బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఉందో లేదో ధృవీకరణలో కనిపిస్తుంది. ధృవీకరణలో మొత్తం తగినది అయితే పత్రాలు కూడా సరైనవని అర్థం. అప్పుడు ఖాతా మరియు PRAN కార్డు తిరిగి ప్రారంభించబడతాయి.

Axis Bank Customers : యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక..! డబ్బు లావాదేవీలు ఏవైనా ఉంటే ముందే చేసుకోండి..

Singer Madhu Priya : సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ.. కారణం ఇదే..

Oxygen: థాయిలాండ్‌ నుంచి భారత్‌కు 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు.. ఉచితంగా అందించనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..