Discount on Rail Tickets: రైలు ప్రయాణీకులకు శుభవార్త..రిజర్వుడు టికెట్లపై డిస్కౌంట్..ఎంతో.. ఎలానో తెలుసుకోండి!

Discount on Rail Tickets: రైలు ప్రయాణం చేసేవారికి శుభవార్త చెప్పింది ఇండియన్ రైల్వేస్. యూపీఐ, భీమ్ యాప్ ల ద్వారా ప్రయాణ టికెట్లను బుక్ చేసుకునేవారికి ఇస్తున్న డిస్కౌంట్ పథకాన్ని జూన్ 2022 వరకూ పొడిగించింది.

Discount on Rail Tickets: రైలు ప్రయాణీకులకు శుభవార్త..రిజర్వుడు టికెట్లపై డిస్కౌంట్..ఎంతో.. ఎలానో తెలుసుకోండి!
Discount On Rail Tickets
Follow us
KVD Varma

|

Updated on: Jun 14, 2021 | 12:43 PM

Discount on Rail Tickets: రైలు ప్రయాణం చేసేవారికి శుభవార్త చెప్పింది ఇండియన్ రైల్వేస్. యూపీఐ, భీమ్ యాప్ ల ద్వారా ప్రయాణ టికెట్లను బుక్ చేసుకునేవారికి ఇస్తున్న డిస్కౌంట్ పథకాన్ని జూన్ 2022 వరకూ పొడిగించింది. ఈ పథకం ద్వారా కౌంటర్లలో టికెట్ లు బుక్ చేసుకున్నవారే లబ్ది పొందుతారు. ఆన్ లైన్ రిజర్వేషన్ కు ఈ డిస్కౌంట్ పథకం వర్తించదు. కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) కౌంటర్ వద్ద బుక్ చేసుకునే టికెట్ల ప్రాథమిక చార్జీల మొత్తం పై 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ విధానం 50 రకాల యూపీఐ పేమెంట్స్ కు వర్తిస్తుంది. అదేవిధంగా భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (బీహెచ్ఐఎం-భీమ్) యాప్ ద్వారా జరపే చెల్లింపులకూ ఇది వర్తిస్తుంది అయితే, ప్రయాణీకులు రిజర్వు చేసుకునే టికెట్ విలువ కనీసం 100 రూపాయాలు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి.

భారతీయ రైల్వే 1 డిసెంబర్ 2017 నుండి టిక్కెట్ల చెల్లింపును అంగీకరించే పద్ధతిని ప్రారంభించింది. ఇప్పుడు డిస్కౌంట్ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించినట్లు దేశ జాతీయ రవాణా సంస్థ ఇండియన్ రైల్వే ప్రకటించింది.అయితే, రైల్వే ప్రయాణికులు ఈ టికెట్‌ను కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు మరియు ఆన్‌లైన్ టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా పొందలేరు. ఈమేరకు భారత రైల్వే సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. మీరు రైల్వే టికెట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద కొనుగోలు చేసినపుదు ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అదేవిధంగా, కేవలం యూపీఐ లేదా భీమ్ యాప్ ల ద్వారా టికెట్లను కొనుగోలు చేస్తేనే ఈ తగ్గింపు లభిస్తుంది. ఈ ధరల తగ్గింపు టికెట్ ప్రాథమిక చార్జీలపై ఉంటుంది. అంటే మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి రైలు టికెట్ రిజర్వు చేసుకుంటే.. మీకు విశాఖపట్నం వారకూ ఉండే రైలు చార్జీపై డిస్కౌంట్ ఇస్తారు. రిజర్వేషన్ చార్జీలు, బుకింగ్ చార్జీలపై డిస్కౌంట్ ఉండదు.

రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో యుపిఐ / భీమ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం ఇలా..

  • మీరు రిజర్వేషన్ కౌంటర్ లో మీ ప్రయాణ వివరాలతో నింపిన ఫాం అందచేయాలి.
  • మీ రిజర్వుడ్ టికెట్ సిద్ధం అయిన తరువాత మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని కౌంటర్ లోని రైల్వే ఉద్యోగి చెబుతారు.
  • మీరు మీ టికెట్ సొమ్మును యుపిఐ / భీమ్ ద్వారా చెల్లించనున్నట్టు చెప్పాలి.
  • అప్పుడు కౌంటర్ లోని ఉద్యోగి మీ వర్చువల్ చెల్లింపు చిరునామా (వీపీఏ) అడుగుతారు. మీరు దానిని అతనికి చెప్పిన తరువాత లావాదేవీ ప్రార్రంభిస్తారు.
  • మీ పేమెంట్ నిర్ధారించడానికి మీ మొబైల్ కు ఒక మెసేజ్ వస్తుంది.
  • దీనిని మీరు ధృవీకరిన్చాల్సి ఉంటుంది. మీరు ఒకే చేసిన తరువాత మీ టికెట్ చార్జీలు మీ యూపీఐ లింక్డ్ బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అవుతాయి.
  • ఈ లావాదేవీ పూర్తియిన వెంటనే మీ టికెట్ కౌంటర్ ఉద్యోగి ప్రింట్ తీసి ఇస్తారు.

Also Read: Aadhar Card Latest Update : మీ ఆధార్ కార్డు అప్‌డేట్ అయిందా లేదా..! తెలుసుకోవాలంటే ఇలా చేయండి..

world blood donor day -2021 : కొవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు రక్తదానం చేయొచ్చా..? చేస్తే ఏం జరుగుతుంది..