పాత బట్టలను దానం చేస్తున్నారా ? అసలు వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా ?

పాత బట్టలను దానం చేయడం మంచిది. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానం చేసే ముందు బట్టలను శుభ్రంగా ఉతికేందుకు ఉప్పు నీటిలో నానబెట్టడం అవసరం. పాడైన లేదా మురికిగా ఉన్న బట్టలను దానం చేయడం అనవసరం. వీటితో పాటు గురువారం రోజున బట్టలు దానం చేయడం వాస్తు ప్రకారం అనుకూలంగా ఉండదు. చలికాలంలో దుప్పట్లు, స్వెటర్లు వంటి వస్తువులు దానం చేయడం మంచిది.

పాత బట్టలను దానం చేస్తున్నారా ? అసలు వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా ?
What Vastu Says About Donating Old Clothes
Follow us
Prashanthi V

|

Updated on: Jan 13, 2025 | 8:15 PM

మనలో చాలా మంది తమకు చేతనైనంత దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా దాన ధర్మాలు చేస్తుంటారు. చాలా వరకు అయితే పాత బట్టలను దానం ఇస్తుంటారు. పాత బట్టలను దానం చేయడం అనేది ఒక మంచి పద్ధతి. కానీ, దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తించుకోవాల్సి ఉంటుంది. బట్టలు దానం చేయడం వల్ల ఆరోగ్యం, సంపద, ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. ఉపయోగకరంగా ఉన్న బట్టలను నీట్ గా వాష్ చేసి ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయం

పాత బట్టలు ఎక్కువ కాలం ధరించడంతో అవి కొన్నిసార్లు మురికిగా మారిపోతాయి లేదా పాడైపోతాయి. వీటిని ఇతరులకు ఇచ్చినప్పుడు అవి వారికి ఉపయోగపడకపోవచ్చు. చాలామంది పాత బట్టలను చెత్తలో పారేస్తారు లేదా ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే, బట్టలు దానం చేయాలనుకుంటే, వాటిని శుభ్రంగా ఉతకడం, అవి ఉపయోగానికి అనువుగా ఉన్నాయా అనే విషయం చాలా ముఖ్యం. దానం చేసే ముందు బట్టలు శుభ్రంగా ఉతకడం వల్ల అవి మరింత ఉపయోగకరంగా మారుతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం, పాత బట్టలు ప్రతికూల శక్తులను ఇంట్లోకి తీసుకురావచ్చు. ఉదాహరణకు, చిరిగిన బట్టలు లేదా పాడైన బట్టలు ఇతరులకు ఇవ్వడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఈ బట్టలు ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తాయి. పైగా ఇంట్లో ప్రతికూల శక్తులను ప్రసారం చేస్తాయి. కనుక, పాత బట్టలను దానం చేసే ముందు వాటి పరిస్థితిని పరిక్షించి, అవి మంచి స్థితిలో ఉండేలా చూసుకోవాలి. మంచిగా ఉతికిన, కొంతకాలం ఉపయోగించిన బట్టలు మాత్రమే దానం చేయాలి.

మరో ముఖ్యమైన విషయం.. పాత బట్టలను దానం చేయాలనుకుంటే, వాటిని ఉప్పు నీటిలో నానబెట్టడం మంచిది. ఉప్పు నీటిలో నానబెట్టడం ద్వారా బట్టలు శుద్ధి అవుతాయి, ప్రతికూల శక్తులను తొలగించవచ్చు. అలా చేసిన తర్వాత వాటిని మంచిగా ఉతికి దానం చేయడం మంచిది. ఎప్పుడూ శుభ్రంగా, మంచి పరిస్థితిలో ఉన్న బట్టలు మాత్రమే దానం చేయాలి, మురికిగా ఉన్న లేదా పాడైన దుస్తులు ఇవ్వడం తప్పు.

గురువారం రోజున దుస్తులు దానం చేయడం వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది కాదు. గురువారం వాస్తు శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన రోజు, ఇది శక్తులతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రోజున దానం చేయడం నెగిటివ్ ఫలితాలు కలిగించవచ్చు. అందువల్ల, గురువారం బదులు ఇతర వారాల్లో దానం చేయడం ఉత్తమం. చలికాలంలో, దుప్పట్లు, స్వెటర్లు, రగ్గులు వంటి వస్తువులు దానం చేయడం కూడా అనుకూలంగా ఉంటుంది. దానం చేయడం వల్ల ఆరోగ్యం, సంపద, శాంతి లభించవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది.