AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Expensive Vegetable: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెజిటబుల్.. కేజీ రూ. 85 వేలు నుంచి లక్ష.. ఎలా సాగు చేయాలంటే..

ఖరీదైన కూరగాయలంటే బ్రకోలీ,క్యాప్సికమ్, అవొకాడ ఇవి మాత్రమే మనకు మాత్రమే. కానీ అన్నింటికన్నా ఖరీదైన కూరగాయ ‘హాప్ షూట్స్’ ఒకటి ఉందని మనలో చాల తక్కువ మందికి తెలుసు. ఇందుకు సంబంధించిన..

Most Expensive Vegetable: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెజిటబుల్.. కేజీ రూ. 85 వేలు నుంచి లక్ష.. ఎలా సాగు చేయాలంటే..
Hopshoots
Sanjay Kasula
|

Updated on: Dec 02, 2022 | 1:41 PM

Share

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కూరగాయలలో ‘హాప్ షూట్స్’ ఒకటని మీకు తెలుసా. ఇది ఒక ఔషధ పుష్పం, ఇది వైన్ తయారీలో ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ ఇది అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉంది. హాప్ షూట్‌ శాస్త్రీయ నామం హ్యూములస్ లుపులస్. ఇవి జనపనార కుటుంబానికి చెందిన మొక్కలు. ఇది ఇతర కూరగాయల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. భారతదేశంలో ‘హాప్ షూట్స్’ సాగు పెద్దగా విజయవంతం కాలేదు. ఇది ఉష్ణమండల మొక్క. ఇది ఉత్తర అమెరికా, యురేషియా, దక్షిణ అమెరికా ప్రాంతాలలో మాత్రమే పెరుగుతుంది. అక్కడి రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తారు. రూ.85 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయిస్తున్న ఈ పూల పంట ప్రత్యేకతను తెలుసుకుందాం.

భారతదేశంలో ‘హాప్ షూట్స్’ లను సాగు చేయవచ్చా..? ‘హాప్ షూట్స్’ సాగుకు ఉష్ణమండల వాతావరణం చాలా అవసరం. కాబట్టి దీనిని భారతదేశంలో సాగు చేయలేం. కానీ చాలా మంది ‘హాప్ షూట్స్’ ను సాగు చేసేందుకు ప్రయత్నించారు.  కానీ విజయవంతం కాలేదు. ఈ కూరగాయల రుచి చేదుగా ఉంటుంది. ఇందులో ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయి. చాలా మంది ‘హాప్ షూట్స్’ ను పచ్చిగా తినడానికి కూడా ఇష్టపడతారు.

 ‘హాప్ షూట్స్’ ఎందుకు ఖరీదైనది..

ఈ పంట చేతికి రావాలంటే మూడేళ్లు పడుతుంది. హాప్ షూట్‌లకు పూసే పువ్వును బీర్ తయారీలో వాడతారు. దీనిలో విటమిన్లు E, B6, Cలతో నిండి ఉంటుంది. అపారమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు అధికం. అందుకే ఈ కూరగాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కూరగాయలో క్షయవ్యాధిని నియంత్రించే ప్రతిరక్షకాలు ఉంటాయి. నిద్రలేమి, టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, యాంగ్జయిటీ వంటి అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో హాప్ షూట్స్ ఉపయోగపడతాయి. హాప్ షూట్లు తినడం వల్ల జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది.

ఈ పంటను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు, కోతకు కూడా చాలా శ్రమ పడుతుంది. అయినప్పటికీ, అనేక దేశాలలో దీని డిమాండ్ కూడా ఉంది. దీని ధరలు ఎక్కువగా ఉండడానికి కారణం ఇదే. మరో విషయం ఏమిటంటే, ఈ మొక్కలు వరుసలో పెరగవు, కానీ గుబురుగా ఉంటాయి, దీని కారణంగా సాగుదారుడు జాగ్రత్తగా కోయవలసి ఉంటుంది.

హాప్ షూట్‌ ప్రయోజనాలు

ఇది వ్యాధులతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది.బలాన్ని అందిస్తుంది. ఆందోళన, నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం, ఒత్తిడి, ఉత్సాహం, శ్రద్ధ లోటు-హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD), భయము మరియు చిరాకు మొదలైనవాటిని కూడా హాప్ షూట్‌లతో పరిష్కరించవచ్చని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఇది క్యాన్సర్ కణాలు మరియు లుకేమియా కణాలను కూడా నిరోధించగలదు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం