ఎలుకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్.. దీన్ని మీ ఇంటి గుమ్మంలో ఉంచితే.. అవి రమ్మన్నారావు..
మనం దువ్వెనను ఎందుకు ఉపయోగిస్తాం.. జుట్టు దువ్వుకోవడానికి కదా.. కానీ ఇక్కడో మహిళ మాత్రం ఎలుకలను తరిమికొట్టేందుకు దువ్వెనను ఉపయోగిస్తోంది. వినడానికి కొంత వింతగా అనిపించిన ఇది నిజం. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకు దువ్వెనతో ఆ మహిళ ఎలుకలను ఎలా తరిమికొట్టిందో తెలుసుకుందాం పదండి.

ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలుకల సమస్య ఉంటుంది. చాలా మంది ఎలుకలను ఇళ్ల నుండి తరిమికొట్టడానికి అనేక రకాల ఉపాయాలు చేస్తారు. కానీ అవి అప్పటివరకు మాయమైనా మళ్లీ ఎలాగొలా ఇంట్లోకి వచ్చేస్తాయి. కానీ మన ఇంట్లో జుట్టు దువ్వుకోవడానికి ఉపయోగించే దువ్వెనతో ఎలుకలను ఇంట్లోకి రానివ్వకుండా చేయొచ్చని ఒక మహిళ చెబుతోంది.
మహిళ ప్రకారం.. ఎలుకలను తరిమికొట్టడానికి ముందుగా ఒక చెంచా శనగపప్పు తీసుకొవాలి. తర్వాత గడువు ముగిసిన ఏదైనా ట్యాబ్లెట్ తీసుకొని దానిని పొడిగా చేసి కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపాలి. తర్వాత ఈ మిశ్రమంలో బేకింగ్ సోడా, గోధుమ పిండి, కొద్దిగా నీరు కలిపి వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఒక పనికిరాని దువ్వెనతో పాటు కొంత పత్తిని తీసుకొని దానిని మూడు ముక్కలుగా చేయడం. తర్వాత మీరు కలిపిన మిశ్రమాన్ని కొంచెం ఈ దూదిపై పూయండి. అలా పూసిన దూదిని ఎలుకలు వచ్చే ప్రాంతంలో ఉంచండి. అలానే మీరు మొదటగా తీసుకున్న దువ్వెనకు కూడా ఈ మిశ్రమాన్ని పూసి దాన్ని కూడా ఎలుకలు దూరే ప్రదేశంలో ఉంచండి.
ఆ ప్రదేశంలోకి ఎలుకలు వచ్చినప్పుడు వీటిపై ఉన్న ఆ మిశ్రమం ఎలుకలను ఆకర్షిస్తుంది. దీంతో ఆ ఎలుకలు ఈ మిశ్రమాన్ని తింటాయి. ఈ మిశ్రమంలో ఉన్న ఔషధ మాత్ర, బేకింగ్ సోడా ఎలుకలను అసౌకర్యాన్ని కగిస్తాయి. దీంతో అవి ఇంటి నుండి పారిపోతాయి.
వీడియో చూడండి..
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




