- Telugu News Photo Gallery Spiritual photos Guru Gochar: Exalted Jupiter in Cancer Mega Benefits for These zodiac signs
Lucky Zodiac Signs: హంస యోగం.. ఆ రాశుల వారిని అదృష్టం పట్టడం పక్కా..!
ఈ నెల(అక్టోబర్) 19 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు గురువు కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఇంతవరకూ మిథున రాశిలో సంచారం చేస్తున్న గురువు అతిచార దోషం వల్ల కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కర్కాటక రాశి గురువుకు ఉచ్ఛ క్షేత్రం. గురువు ఉచ్ఛ క్షేత్రంలో ప్రవేశించినప్పుడు మేష, కర్కాటక, తుల, మకర రాశులకు హంస మహా పురుష యోగాన్ని, మిథునం, కన్య, వృశ్చిక రాశులకు మహా భాగ్య యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. హంస మహా పురుష యోగం వల్ల ప్రముఖుల స్థాయికి చేరిపోవడం, ఆదాయం వృద్ధి చెందడం, రాజకీయ ప్రాబల్యం కలగడం, ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లడం, విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం వంటివి తప్పకుండా జరుగుతాయి.
Updated on: Oct 08, 2025 | 7:47 PM

మేషం: గురువు చతుర్థ కేంద్రంలో ఉచ్ఛపట్టినప్పుడు హంస మహా పురుష యోగం కలుగుతుంది. దీని వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఏది జరిగినా సానుకూలంగా మాత్రమే జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలను పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించి వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి లాభం, భూలాభం కలుగుతుంది. గృహ యోగం పడుతుంది. సుఖ సంతోషాలు బాగా పెరుగుతాయి.

మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల మహా భాగ్య యోగం కలుగుతుంది. దీనివల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యు లేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము తప్పకుండా చేతికి అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి బాగా పెరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన గురువు ఈ రాశిలో ఉచ్ఛపడుతున్నందువల్ల హంస మహా పురుష యోగం కలిగింది. రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడవుతాడు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి.

కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల మహా భాగ్య యోగం కలిగింది. దీని వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.

తుల: ఈ రాశికి దశమ కేంద్రంలో గురువు ఉచ్ఛస్థితి కలగడం వల్ల హంస మహా పురుష యోగం పట్టింది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అధికార యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో ధనాధిపతి గురువు ఉచ్ఛపట్టడం వల్ల మహా భాగ్య యోగం కలిగింది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితికి రావడం వల్ల హంస మహా పురుష యోగం కలిగింది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఒక వెలుగు వెలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలకు దశ తిరుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి, విదేశీ ఆఫర్లు లభిస్తాయి. నిరుద్యోగులు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చేరే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది.



