AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Bill: మీ జీఎస్జీ ఇన్‌వాయిస్ ఒరిజనలేనా? అయితే మీకు రూ. కోటి రివార్డు! అదెలా సాధ్యం? ఇది చదవండి..

ప్రభుత్వం అన్ని కొనుగోళ్లకు బిల్లులు అడిగేలా వినియోగదారులను ప్రోత్సహించే ప్రయత్నంలో మేరా బిల్ మేరా అధికార్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద వినియోగదారులు ఒక కోటి రూపాయల వరకు అద్భుతమైన రివార్డులు పొందొచ్చు. రివార్డ్‌కు అర్హత పొందడానికి, కస్టమర్‌లు తప్పనిసరిగా తమ బిల్లులను మేరా బిల్ మేరా అధికార యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.

GST Bill: మీ జీఎస్జీ ఇన్‌వాయిస్ ఒరిజనలేనా? అయితే మీకు రూ. కోటి రివార్డు! అదెలా సాధ్యం? ఇది చదవండి..
Gst
Madhu
| Edited By: |

Updated on: Nov 29, 2023 | 9:44 PM

Share

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ).. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పన్ను చెల్లింపుల విధానం. మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువుపైనా ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇది వరకూ పన్నుల విధానం చాలా గందరగోళంగా ఉండేది. ఓ పట్టాన అర్థమయ్యేది కాదు. ఈ జీఎస్టీ విధానం వచ్చాక, ఏ ఉత్పత్తికి ఎంత పన్ను, ఏ స్లాబ్ లోకి వస్తుందన్న విషయం సామాన్యులకు సైతం సులభంగా అర్థమవుతోంది. ఇది వచ్చిన తర్వాతే జవాబుదారీతనం కూడా వచ్చింది. ప్రభుత్వానికి కచ్చితమైన ఆదాయం కూడా లభిస్తోంది. అయితే ఇది కొంతమంది వ్యాపారులు పన్ను భారం లేకుండా ఉండేందుకు నకిలీ జీఎస్టీ బిల్లులను కూడా సృష్టిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నకిలీ జీఎస్టీ బిల్లలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా గుర్తించాలి? వాటి వల్ల వినియోగదారులు ఎలా నష్టపోతున్నారు? తెలుసుకుందా రండి..

ఎక్కువగా జీఎస్టీ ఫ్రాండ్ కేసులు ఫేక్ ఇన్ వాయిస్ లను పొందడం ద్వారానే జరుగుతున్నాయి. ఈ ఫేక్ ఇన్ వాయిస్ ల ద్వారా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని తప్పుగా పొందుతున్నారు. వీటి ద్వారా బయట జీఎస్టీ చెల్లించినట్లుగా చూపించి, వస్తువుల క్రయ విక్రయాలు జరుపుతున్నారు. జీఎస్టీ ప్రారంభించిన నాటి నుంచి ఈ తరహా మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు పేర్కొంటున్నారు. పన్ను ఎగవేతను నిరోధించడానికి నకిలీ జీఎస్టీ ఇన్‌వాయిస్‌ను గుర్తించడం చాలా ముఖ్యం.

నకిలీ జీఎస్టీ ఇన్‌వాయిస్ అంటే ఏమిటి?

నకిలీ జీఎస్టీ ఇన్ వాయిస్ అంటే.. ఓ సంస్థ అసలు వస్తువులు లేదా సేవల సరఫరా లేకుండానే సరఫరా చేసినట్లుగా, అందుకు సంబంధించిన చెల్లింపులు కూడా జరిపినట్లుగా బిల్లులు ఇచ్చిందనుకోండి. దానిని నకిలీ ఇన్ వాయిస్ అని అంటారు. దీనిని సాధారణ ప్రజలు గుర్తించలేరు. అందుకోసం టెక్నికల్ గా కొన్ని అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. నకిలీ జీఎస్టీ ఇన్ వాయస్ ను ఎలా గుర్తించాలనే దానిని స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

GSTIN సంఖ్యను వెరిఫై చేయండి.. ఇన్‌వాయిస్‌లో చెల్లుబాటు అయ్యే GSTIN (వస్తువులు,సేవల పన్ను గుర్తింపు సంఖ్య) ఉందో లేదో తనిఖీ చేయండి. చెల్లుబాటు అయ్యే GSTINలో 15 అంకెలు ఉండాలి. ప్రతి నమోదిత వస్తువులు లేదా సేవల సరఫరాదారుకు GSTIN కేటాయించబడుతుంది, ఇది రాష్ట్ర కోడ్, పాన్, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ కలిసి ఉంటుంది.

దీనిని ధ్రువీకరించడానికి అధికారిక జీఎస్టీ పోర్టల్ (https://www.gst.gov.in/)లోకి వెళ్లాలి. అందులో ‘సెర్చ్ ట్యాక్స్‌పేయర్’ విభాగంలో GSTIN సంఖ్యను నమోదు చేయాలి. అందులో కనిపించిన సరఫరాదారు సమాచారంతో మీ దగ్గర ఉన్న ఇన్ వాయిస్ సరిపోలుతున్నదో లేదో తనిఖీ చేయాలి. GSTIN చెల్లుబాటు అయితే, సరఫరాదారు పేరు, చిరునామా స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.

ఇన్‌వాయిస్ సంఖ్య, తేదీ.. GST బిల్లులో పేర్కొన్న తేదీ, ఇన్‌వాయిస్ నంబర్‌ను తనిఖీ చేయండి. ఏదైనా వ్యత్యాసాన్నిపేర్కొన్న బిల్లు నకిలీ జీఎస్టీ బిల్లు అని సూచించవచ్చు.

హెచ్ఎస్ఎన్, ఎస్ఏసీ కోడ్‌లు.. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమెన్‌క్లేచర్(హెచ్ఎస్ఎన్) కోడ్ వస్తువులకు కేటాయించబడుతుంది. అదే సేవలకు అయితే అకౌంటింగ్ కోడ్ కేటాయించబడుతుంది.దీనిని జీఎస్టీ పోర్టల్ లో ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.

పన్ను చెల్లింపు స్థితిని ధ్రువీకరించండి.. జీఎస్టీ పోర్టల్‌ని సందర్శించి, సరఫరాదారు పన్ను చెల్లింపు చరిత్రను తనిఖీ చేయండి. సందేహాస్పద ఇన్‌వాయిస్‌కు సరఫరాదారు పన్నులు చెల్లించారని నిర్ధారించుకోండి.

మేరా బిల్లు మేరా అధికార్ స్కీమ్..

ఇటీవల, ప్రభుత్వం అన్ని కొనుగోళ్లకు బిల్లులు అడిగేలా వినియోగదారులను ప్రోత్సహించే ప్రయత్నంలో మేరా బిల్ మేరా అధికార్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం లక్ష్యం ప్రజలలో సాంస్కృతిక, ప్రవర్తనా మార్పును సృష్టించడం, వారి హక్కుగా బిల్లును అభ్యర్థించమని వారిని ప్రోత్సహించడం. ఈ పథకం కింద వినియోగదారులు ఒక కోటి రూపాయల వరకు అద్భుతమైన రివార్డులు పొందొచ్చు. రివార్డ్‌కు అర్హత పొందడానికి, కస్టమర్‌లు తప్పనిసరిగా తమ బిల్లులను మేరా బిల్ మేరా అధికార యాప్‌కి అప్‌లోడ్ చేయాలి. వారు బిల్లులను merabill.gst.gov.in వెబ్ పోర్టల్‌కు కూడా అప్‌లోడ్ చేయవచ్చు. మేరా బిల్ మేరా అధికార్ ప్రస్తుతం ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. జీఎస్టీ నమోదిత సరఫరాదారులు వినియోగదారులకు సమర్పించిన అన్ని ఇన్‌వాయిస్‌లు దీనిలో అప్ లోడ్ చేసుకొని రివార్డు పొందుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..